2020లో ఎన్నికల్లో ఓటమి తర్వాత వైట్‌హౌస్ నుంచి వెళ్లిపోకుండా ఉండాల్సిందని అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తన పదవీకాలంలో అమెరికా అధ్యక్షుడిగా చాలా అద్భుతంగా పని చేశానన్న ఆయన.. వైట్‌హౌస్‌లోనే ఉండి ఉంటే బాగుండేదని అన్నారు. పెన్సిల్వేనియా సభలో ట్రంప్ ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఫేక్ న్యూస్’లతో తనపై అనవసర విమర్శలు చేసినా పట్టించుకోనని పేర్కొన్నారు.