AP: వరద బాధితులకు సహాయార్థం సీఎం సహాయ నిధికి సినీ, వ్యాపార ప్రముఖులు, పలు స్థానిక సంస్థలు విరాళాలు అందజేసిన విషయం తెలిసిందే. తాజాగా ఫార్మారంగ సంస్థ భారత్ బయోటెక్ సీఎం సహాయనిధికి రూ.కోటి విరాళాన్ని అందించింది. ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎల్ల, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయిప్రసాద్.. విరాళానికి సంబంధించిన చెక్కును నిన్న ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబును కలిసి అందజేశారు.