పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ బాబర్ అజామ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. పాక్ వైట్ బాల్ కెప్టెన్సీ నుంచి బాబర్ తప్పుకున్నాడు. వ్యక్తిగత ప్రదర్శనపై మరింత దృష్టి సారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎక్స్ వేదికగా తెలిపాడు. టెస్టుల్లో సాన్ మసూద్ సారథిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. వన్డే, టీ20ల నుంచి బాబర్ తప్పుకోవడంతో పీసీబీ ఎవరిని కెప్టెన్ చేస్తుందో చూడాలి.