TG: కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టమైన లక్ష్యంతో హైడ్రా తీసుకొచ్చిందని మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ పేర్కొన్నారు. ఆక్రమణలకు సంబంధించిన వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపారు. చెరువులు, కుంటల ఆక్రమణలు తొలగించేందుకే రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా తీసుకొచ్చిందని స్పష్టం చేశారు. అలాగే, రాహుల్ గాంధీ ఎప్పుడూ పాలనలో జోక్యం చేసుకోరని వెల్లడించారు.