TG: రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. సమీక్షలో మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. నోటిఫై చేసిన ప్రతి జిన్నింగ్ మిల్లు పని చేయాలని ఆదేశించారు. తేమ శాతం సడలింపులపై సీసీఐ సీఎండీకి వినతి అందించారు. రైతులు సమీప కొనుగోలు కేంద్రాల వద్ద పత్తి అమ్ముకోవాలని పేర్కొన్నారు.