ఢిల్లీలో ఏటా అక్టోబర్ చివరి నుంచే వాయి కాలుష్యం గరిష్ట స్థాయికి చేరుతుంటుంది. పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా రైతులు పంటల వ్యర్థ్యాలు తగలబెట్టడానికి తోడు, చలికాలం కావడంతో దట్టమైన పొగ మంచు కారణంగా ఢిల్లీలో గాలి నాణ్యత క్షీణించింది. దీన్ని కట్టడి చేసేందుకు ఆప్ ప్రభుత్వం నగరంలో కృత్రిమ వర్షం కురిపించేందుకు సిద్ధమైంది. నవంబర్ 1-15వ తేదీ వరకు కృత్రిమ వర్షం కురిపించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు.