కొత్తగా వస్తున్న యువ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఉపాధి ఆధారిత ప్రోత్సాహ పథకం (ఈఎల్ఐ) కింద వారి ఈపీఎఫ్ ఖాతాలో ఒక నెల వేతనం (గరిష్ఠంగా రూ.15 వేలు) జమ చేయనున్నట్లు కేంద్రమంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. తెలంగాణ అధిక మిగులు నిధులున్న జోన్‌గా నిలిచిందని తెలిపారు. ఏటా వస్తున్న చందా మొత్తం పెరుగుతోందని చెప్పారు. ఇక తెలంగాణలో 47.96 లక్షల మంది చందాదారులు ఉన్నట్లు తెలిపారు.