కేంద్రమంత్రి, జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఏడీజీపీ ఎం చంద్రశేఖర్ ఫిర్యాదు మేరకు కుమారస్వామి, ఆయన కుమారుడు నిఖిల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. కుమారస్వామి నిందితుడిగా ఉన్న మైనింగ్ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందానికి తాను నేతృత్వం వహిస్తున్నట్లు చంద్రశేఖర్ తెలిపారు. మైనింగ్ కేసులో విధులు నిర్వర్తించకుండా అడ్డుకుని, బెదురిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.