NCP శరద్‌పవార్ వర్గానికి చెందిన నేత జితేంద్ర అవధ్ భార్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అబ్దుల్ కలాం జీవిత చరిత్రను చదివినట్లే.. బిన్ లాడెన్ జీవిత చరిత్రను కూడా చదివి తెలుసుకోవాలని రూతా అవధ్ సూచించారు. ‘దివంగత రాష్ట్రపతి జీవిత చరిత్రను.. బిన్ లాడెన్ చరిత్రతో ముడిపెడతారా? ఉగ్రవాదులను వెనకేసుకురావడం ఇండియా కూటమి పార్టీలకు అలవాటుగా మారింది’ అంటూ BJP నేత షెహజాద్ మండిపడ్డారు.