పండ్లు ఆరోగ్యానికి మంచివన్న విషయం తెలిసిందే. అయితే స్టోన్ ఫ్రూట్స్‌తో ఎన్నో అనారోగ్య సమస్యలు దూరమవుతాయని నిపుణులు చెబుతున్నారు. పెద్ద గింజ, దాని చుట్టూ గుజ్జు ఉండే మామిడి, పీచ్, ఆప్రికాట్స్, చెర్రీస్ వంటి పండ్లని స్టోన్ ఫ్రూట్స్ అంటారు. వీటిలో పుష్కలంగా ఉండే ఔషధగుణాలు శరీరంలో ఇన్ఫెక్షన్లు, అలర్జీలను తగ్గిస్తాయి. అలసట, నీరసం దరిచేరదు. కణాలు డ్యామేజ్ కాకుండా ఉంటాయి. తెల్ల రక్తకణాల సంఖ్య పెరుగుతుంది.