తెలంగాణ సచివాలయ ప్రాంగణంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఈ సందర్భంలో మాజీ మంత్రి KTR తో పాటు BRS పార్టీ నాయకులు చేసిన వ్యాఖ్యలకు జవాబిచ్చారు.
రాజీవ్ గాంధీ వలెనే భారతదేశానికి కంప్యూటర్ వచ్చింది. ఎంతోమంది యువత ఉద్యోగ అవకాశాలు పొందారని అన్నారు.. మాజీ మంత్రి KTR మరియు BRS పార్టీ నాయకులు చేసిన వ్యాఖ్యలకు సమాధానమిస్తూ, రాజీవ్ గాంధీ ఆనాడు ప్రవేశపెట్టిన కంప్యూటర్ సాంకేతికత వలనే విదేశీ విద్య కారణం అంటూ విమర్శించారు.
ఆనాడు రాజీవ్ గాంధీ కృషి వలెనే విదేశీ విద్య చదువుకున్నావు అని, లేదంటే గుంటూరు లో ఇడ్లీ, సమోసాలు అమ్ముకునేటోడివి అంటూ ఘాటుగా సంపాందించారు సీఎం రేవంత్ రెడ్డి.
ఈ విధంగా, రేవంత్ రెడ్డి KTR పై చేసిన వ్యాఖ్యలు, రాజకీయ చర్చలను మరింత పెంచాయి. BRS పార్టీకి చెందిన నాయకులు మరియు KTRకి ఈ విమర్శలపై తమ అభిప్రాయాలను స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఈ ఘాటైన వ్యాఖ్యలపై KTR, ఇతర BRS నాయకులు ఎలా సాధిస్తారో చూడాలి