Rinky chakma : మాజీ మిస్ ఇండియా రింకీ చక్మా క్యాన్సర్తో రెండేళ్ల పోరాటం తర్వాత మరణించింది. ఆమెకు రొమ్ము క్యాన్సర్ వచ్చింది. శస్త్రచికిత్స కూడా జరిగింది. ఫెమినా మిస్ ఇండియా రింకీ చక్మా మృతి పట్ల పలువురు ప్రముఖు సంతాపం వ్యక్తం చేశారు. ‘రింకీ కుటుంబానికి, ఆమె స్నేహితులకు మా సానుభూతిని తెలియజేస్తున్నాము. అతని ఆత్మకు శాంతి కలుగుగాక. రింకీ, మీ అందం, కృషి తరతరాలకు గుర్తుండి పోతుంది. మేమంతా నిన్ను ఎప్పటికీ మిస్ అవుతాం. మీతో సన్నిహితంగా ఉండడం మా అదృష్టం. అంటూ ఫెమినా మిస్ ఇండియా ట్విట్టర్లో రాసుకొచ్చింది.
గత నెలలో రింకీ చక్మా సోషల్ మీడియాలో తన ఫోటో షేర్ చేసి ప్రస్తుత పరిస్థితిని వ్యక్తం చేసింది. తాను రెండేళ్లుగా క్యాన్సర్తో పోరాడుతున్నానని చెప్పింది. కానీ ఇప్పుడు ఇది కష్టంగా ఉందంటూ రాసుకొచ్చింది. రింకీ చక్మా దురదృష్టం ఏమిటంటే బ్రెస్ట్ క్యాన్సర్ సర్జరీ చేయించుకున్న తర్వాత బ్రెయిన్ ట్యూమర్ కూడా వచ్చింది. తన ఆరోగ్యం గురించి రింకీ చక్మా మాట్లాడుతూ, ‘నాకు కూడా బ్రెయిన్ సర్జరీ చేయాల్సి ఉంది. దాని ప్రభావం నా శరీరం కుడి వైపున కనిపిస్తుంది. మొదట నేను కీమోథెరపీ చేయించుకోవాలి . అది విజయవంతం అయిన తర్వాత నేను మెదడు శస్త్రచికిత్స చేయించుకుంటాను. గత రెండేళ్లుగా తాను, తన కుటుంబం గడ్డు పరిస్థితులను అనుభవిస్తున్నామని చెప్పారు. అంతే కాదు చికిత్స కోసం కూడా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నానని చెప్పింది. చికిత్సలో తన కుటుంబం పొదుపు చేసిన డబ్బులన్నీ అయిపోయాయని ఆవేదన వ్యక్తం చేసింది. ఎవరైనా ఆర్థికంగా సహాయం చేయాలని కోరింది.