»Nominated Members Cannot Vote Says Supreme Court While Hearing Aap Leaders Plea
Nominated members cannot vote, : ఢిల్లీ మేయర్ ఎన్నిక… మరోసారి వాయిదా….!
Nominated members cannot vote, : ఢిల్లీ మేయర్ ఎన్నిక... మరోసారి వాయిదా....! : ఢిల్లీ మేయర్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడగా... ఫిబ్రవరి16న జరగాల్సి ఉంది. అయితే.... అది కూడా ఇప్పుడు వాయిదా పడటం గమనార్హం. ఈ విషయంపై ఆప్ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. ఈ కేసుపై ఫిబ్రవరి 17న సుప్రీంకోర్టులో విచారణ ఉంది. ఈ క్రమంలో ఫిబ్రవరి 17 విచారణ తర్వాత, MCD మేయర్ ఎన్నిక కోసం కొత్త తేదీ నిర్ణయిస్తారు.
ఢిల్లీ మేయర్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడగా… ఫిబ్రవరి16న జరగాల్సి ఉంది. అయితే…. అది కూడా ఇప్పుడు వాయిదా పడటం గమనార్హం. ఈ విషయంపై ఆప్ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. ఈ కేసుపై ఫిబ్రవరి 17న సుప్రీంకోర్టులో విచారణ ఉంది. ఈ క్రమంలో ఫిబ్రవరి 17 విచారణ తర్వాత, MCD మేయర్ ఎన్నిక కోసం కొత్త తేదీ నిర్ణయిస్తారు.
ఈ సందర్భంలో, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రోటెం ఛైర్మన్‌ను మార్చాలని, నామినేటెడ్ కౌన్సిలర్లను ఓటింగ్‌కు దూరంగా ఉంచాలని డిమాండ్ చేసింది. కాగా, విచారణ జరిగేంత వరకూ ఎంసీడీ మేయర్ ఎన్నికలను వాయిదా వేయాలని సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయంపై ఎల్జీ కార్యాలయం స్పందించింది. ఫిబ్రవరి 16వ తేదీన అనుకున్న మేయర్ ఎన్నికలను 17వ తేదీ తర్వాత ప్రకటిస్తామని తెలిపింది.
కాగా, ఇప్పటికే మేయర్, డిప్యూటీ మేయర్, ఎంసీడీ ఆరుగురు స్టాడింగ్ కమిటీ సభ్యుల ఎన్నిక మూడుసార్లు సభా సమావేశాలు జరిగినా రసాభాస కావడంతో వాయిదా పడ్డాయి. తొలి సమావేశం జనవరి 6, రెండో సమావేశం జనవరి 24, మూడో సమావేశం ఫిబ్రవరి 6న జరిగింది. ఎల్జీ నామినేట్ చేసిన 10 మంది సభ్యులను ఓటింగ్‌కు అనుమతించాన్ని ఆప్ వ్యతిరేకించడంతో గందరగోళ పరిస్థితుల మధ్య ఎన్నికలు చోటుచేసుకోలేదు. గత ఏడాది డిసెంబర్లో జరిగిన ఎంసీడీ ఎన్నికల్లో ఆప్ 134 వార్డులు గెలుచుకుని విజేతగా నిలవగా, బీజేపీ 104 వార్డులు, కాంగ్రెస్ 9 వార్డులు గెలుచుకుంది.