Chennai Airport : చెన్నై విమానాశ్రయంలో ఇండిగో విమానాన్ని ఢీకొట్టిన ట్రాక్టర్
ఆదివారం రాత్రి చెన్నై విమానాశ్రయంలో లగేజీతో వెళ్తున్న ట్రాక్టర్‌ను ఢీకొనడంతో ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఏటీఆర్ ప్యాసింజర్ విమానం స్వల్పంగా దెబ్బతిన్నది.
Chennai Airport : ఆదివారం రాత్రి చెన్నై విమానాశ్రయంలో లగేజీతో వెళ్తున్న ట్రాక్టర్‌ను ఢీకొనడంతో ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఏటీఆర్ ప్యాసింజర్ విమానం స్వల్పంగా దెబ్బతిన్నది. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్) ఫ్లైట్ సేఫ్టీ అధికారులు దెబ్బతిన్న విమానాన్ని పరిశీలించారు. తనిఖీ అనంతరం అధికారులు మళ్లీ విమానాన్ని నడిపేందుకు అనుమతులు నిరాకరించారు.
ఈ మేరకు ఢిల్లీలోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)కి సమాచారం అందించారు. దీంతో డీజీసీఏ దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు విమానాన్ని నిలిపివేసారు. ఈ ఘటనపై ఇండిగో ఎయిర్‌లైన్స్ విడుదల చేసిన ప్రకటనలో ప్రయాణికుల లగేజీతో వెళ్తున్న ట్రాక్టర్ విమానాన్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని పేర్కొంది.
దీంతో చెన్నై నుంచి తిరుచ్చి వెళ్లాల్సిన ఇండిగో విమానాల 24 సర్వీసులను రద్దు చేశారు. దెబ్బతిన్న విమానాన్ని బాగు చేసిన తర్వాత బుధవారం (నవంబర్ 22) నుంచి విమానాలు తిరిగి ప్రారంభమవుతాయి. తమ ప్రయాణాన్ని రద్దు చేసుకున్న ప్రయాణికులకు వారి ఛార్జీలను వాపసు చేస్తామని కూడా తెలిపింది. దీంతో ఎయిర్‌పోర్టు అధికారులు ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు. బీసీఏఎస్, డీజీసీఏలు పూర్తిగా మరమ్మతులు చేసి మళ్లీ విమానాలు నడిపేందుకు అనుమతి ఇచ్చిన తర్వాతే విమానాన్ని మళ్లీ పనిలోకి తెస్తారని చెబుతున్నారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు.