MSP Hike On Kharif Crops : కేంద్ర ప్రభుత్వం రైతన్నలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఖరీఫ్ లో పండించే 14 రకాల పంటకు మద్దతు ధరను(MSP) పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వరికి రూ.117 పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ పెంపుతో ఇప్పుడు క్వింటాల్ ధాన్యం ధర రూ.2,300కు చేరుకుంది. వరితో పాటు మద్దతు ధరలు పెరిగిన ఇతర పంటలు ఏమేమి ఉన్నాయంటే…?
రాగి, పత్తి, మొక్కజొన్న, జొన్న తదితర పంటలకూ కనీస మద్దతు ధరను(MSP) పెంచుతున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ పెంపు కనీసం 1.5 శాతంగా ఉండనుందని చెప్పింది. పెరిగిన ధరలతో సాధారణ రకం వరి క్వింటాల్ ధర రూ.2,300కు చేరింది. వరి(ఏ గ్రేడ్) రూ.2,320, హైబ్రిడ్ జొన్న రూ.3371, మాల్దండి జొన్న రూ.3,421, సజ్జలు రూ.2625, వేరు శెనగ రూ.6,783, మొక్క జొన్న రూ.2225, రాగులు రూ.4290, నువ్వులు రూ.9,267, పసుపు సోయాబీన్ రూ.4,892, పొద్దుతిరుగుడు రూ.7280, పెసలు రూ.8,682, మధ్యరకం పత్తి రూ.7121, లాంగ్ స్టెపెల్ పత్తి రూ.7,521, మినుములు రూ.7,400, కందులు రూ.7,550కి చేరుకున్నాయి.
వీటితో పాటుగా పలు రకాల నూనె గింజలకు, పప్పు ధాన్యాలకు కూడా మద్దతు ధరను(MSP) పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే గుజరాత్, తమిళనాడుల్లో గిగావాట్ ఆఫ్ షోర్ విండ్ఎనర్జీ ప్రాజెక్టులకు సైతం క్యాబినేట్ ఆమోదం తెలిపింది. ఇందుకు రూ.7,453 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తోంది.