Bihar : బీహార్‌లోని అరారియా జిల్లాలో నిర్మాణంలో ఉన్న మరో వంతెన నదిలో మునిగిపోయింది. ఈ వంతెన నిర్మాణానికి పలువురు స్థానిక నాయకులు కృషి చేశారు. కానీ నిర్మాణ సమయంలో ఈ వంతెనతో పాటు ప్రజల ఆశలన్నీ కొట్టుకుపోయాయి. ఈ వంతెన సిఖ్తీ బ్లాక్ , కుర్సకటాలను కలుపుతూ నిర్మించారు. ఈ ప్రాంతంలోని బక్రా నదిపై ఈ వంతెనను నిర్మించారు. బ్రిడ్జి నిర్మాణంలో అనేక రకాల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
జిల్లాలోని సిఖ్తీ బ్లాక్, కుర్సకటాలను కలిపే ఈ వంతెన నిర్మాణం దాదాపు పూర్తయింది. త్వరలో ప్రారంభోత్సవం చేయబోతున్నారు. కొద్దిరోజుల క్రితం స్థానిక ఎమ్మెల్యే విజయ్‌కుమార్ మండల్ పరిశీలించగా ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ స్థానిక ఎమ్మెల్యేకు పూర్తి స్థాయిలో సమాచారం అందించారు. ఈ సందర్భంగా బ్రిడ్జి, నది చుట్టూ కోత నిరోధక పనులు చేపట్టాలని ఎమ్మెల్యే తరుపున తెలిపారు. అయితే చర్చలు జరిపినా ఎలాంటి పనులు జరగలేదు.
రూ.12 కోట్లు వృథా
ఈ వంతెన నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే విజయ్ కుమార్ మండల్, ఎంపీ ప్రదీప్ కుమార్ సింగ్ కృషి చేశారు. రూ. 12 కోట్లతో ఈ వంతెనను నిర్మిస్తున్నారు. వంతెన దాదాపు సిద్ధంగా ఉంది. రోజువారి రాకపోకలకు ఇబ్బందులు తీరనున్న నేపథ్యంలో ఈ వంతెన నిర్మాణంతో స్థానిక ప్రజలు ఎంతో సంతోషించారు. కానీ, అంతకుముందే ఈ బ్రిడ్జీ ధ్వంసమైంది. ప్రారంభోత్సవానికి ముందే వంతెన కూలిపోవడం అదృష్టమే, దానిపై ట్రాఫిక్ ప్రారంభమై ఉంటే ఇంకా పెద్ద ప్రమాదం జరిగి ఉండేది.