ఇవాళ బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. తాజాగా లోకనాయకుడు కమల్‌హాసన్ షారుఖ్‌కు విషెస్ చెబుతూ ట్వీట్ చేశారు. ‘హ్యాపీ బర్త్ డే మై ఫ్రెండ్. మీరు ఎల్లప్పుడూ చిరునవ్వులు చిందిస్తూ ఆనందంగా ఉండాలని, మరెన్నో సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను’ అంటూ రాసుకొచ్చారు.