సినీ నటుడు శివకార్తికేయన్ హీరోగా నటించిన ‘అమరన్’ ఈ నెల 31న విడుదలవుతుంది. ఈ నేపథ్యంలో తాను మిలటరీ అధికారులతో గడిపిన రోజులను శివ గుర్తుచేసుకున్నారు. ‘ఈ మూవీ కోసం కొందరు మిలటరీ అధికారులతో గడిపాను. ఆ టైంలో వారు మిషన్‌కు వెళ్లారు. వారంతా క్షేమంగా తిరిగి రావాలని కోరుకున్నా. రోజూ వారు క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తాను. మిలటరీ అధికారులు ఎప్పుడు మిషన్‌కు వెళ్తారో.. వెళ్లిన వారిలో ఎవరు తిరిగి వస్తారో తెలియదు’ అని చెప్పారు.