ప్రముఖ నటుడు కమల్ హాసన్ సోదరుడు చారు హాసన్ అస్వస్థతకు గురయ్యారు. గత రాత్రి ఆయన అనారోగ్యానికి గురి కావడంతో కుటుంబ సభ్యులు చెన్నైలోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయాన్ని ఆయన కూతురు, నటి సుహాసిని తెలుపుతూ పోస్ట్ పెట్టారు. ‘దీపావళికి ముందు మా నాన్న అస్వస్థతకు గురయ్యారు. మా పండుగ ఎమర్జెన్సీ వార్డులో గడిచిపోయింది. ప్రస్తుతం ఆయన సర్జరీకి సిద్ధమవుతున్నారు’ అంటూ రాసుకొచ్చారు.