కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటించిన ‘దేవర’ సినిమా భారీ విజయం అందుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో మేకర్స్.. బ్లాక్ బస్టర్ దేవర ప్రోమోను రిలీజ్ చేశారు. తంగాన్ని ఉప్పొంగించే వీరుడు కావాలంటూ జాన్వీ చెప్పే డైలాగ్తో ఈ ప్రోమో మొదలవుతుంది. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.