మన్యం: పార్వతీపురం మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి అక్రమాలపై దర్యాప్తునకు ఆదేశించామని స్దానిక ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర గురువారం తెలిపారు. అతడి అక్రమాలపై తీవ్ర ఆరోపణ వచ్చాయని, చాలామంది వద్ద డబ్బులు తీసుకున్నట్లు, నిబంధనలు విరుద్ధంగా అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయని, అతడి వల్ల ఇబ్బంది పడినవారు ముందుకొస్తే వారికి న్యాయం చేసేందుకు సిద్ధమని తెలిపారు.