కృష్ణ: ముదినేపల్లి మండలం సింగరాయపాలెంలో గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న పేకాటపై పోలీసులు దాడి చేశారు. పేకాడుతున్న ఏ. నాగబాబు, నరేష్, శీలం శ్రీనివాసరావు, మారుబోయిన వెంకటరమణ, కే.రామకృష్ణలను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.5200 నగదును స్వాధీన పరుచుకున్నారు. ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకట కుమార్ తెలిపారు.