రామ్ గోపాల్ వర్మ అంటేనే ఓ సంచలనం.. కానీ ఇప్పుడు వర్మ తీరు మండిపోయేలా ఉంటుంది. ఏ చిన్న విషయమైనా సరే.. వరుస ట్వీట్లు చేసి కాంట్రవర్శీ చేయాలని చూస్తుంటాడు. అలాగే కాంట్రవర్శీ సినిమాలు కూడా చేస్తున్నాడు. తాజాగా రెండు భాగాలుగా రానున్న వ్యూహం రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాడు.
గతంలో ఏపి సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసి నెక్ట్స్ డేనే కొత్త ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేశాడు రామ్ గోపాలా్ వర్మ. ‘వ్యూహం’ అనే రాజకీయ సినిమా తియ్యబోతున్నట్టు ప్రకటించాడు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జీవితంలో 2009-2014 ఎన్నికల వరకు ఏం జరిగింది? అనేది వ్యూహంలో చూపించనున్నారు. అలాగే 2015-2023 వరకు సీఎం జగన్ జీవితంలోని అంశాల నేపథ్యంలో వ్యూహం 2 తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ రెండు చిత్రాల రిలీజ్ డేట్ ప్రకటించారు. వ్యూహం సినిమాను నవంబర్ 10న, శపథం చిత్రాన్ని జనవరి 25న విడుదల చేయనున్నట్టు అనౌన్స్ చేశాడు. రామదూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్‌కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ సినిమా పక్కా ఎలక్షన్ టార్గెట్‌గా రాబోతోంది. ఇక ఈ సినిమా ప్రకటించినప్పుడు.. అహంకారానికి , ఆశయానికి మధ్య జరిగిన పోరాటం నుండి ఉద్భవించిన ‘వ్యూహం’ కథ , రాజకీయ కుట్రల విషంతో నిండి వుంటుంది. రాచకురుపు పైన వేసిన కారంతో బొబ్బలెక్కిన ఆగ్రహానికి ప్రతికాష్టే ‘వ్యూహం’.. అని చెప్పుకొచ్చాడు. అలాగే ఈ చిత్రం 2 పార్ట్స్‌గా రాబోతుందని.. ఫస్ట్ పార్ట్ ‘వ్యూహం’ రెండో పార్ట్ ‘శపథం’ అని.. రెండింటిలోనూ రాజకీయ ఆరాచకీయాలు పుష్కలంగా వుంటాయని.. రాష్ట్ర ప్రజలు ‘వ్యూహం’ షాక్ నుంచి తెరుకునే లోపే వాళ్ళకి ఇంకో ఎలెక్ట్రిక్ షాక్ పార్ట్ 2 ‘శపథం’తో తగులుతుందని అన్నాడు.
అయితే ఎలక్షన్స్ టార్గెట్ గా ఈ చిత్రం తియ్యట్లేదని చెప్తే ఎవ్వరూ నమ్మరు.. అందుకే ఏం చెప్పాలో, ఏం చెప్పకూడదో చెప్పాల్సిన అవసరం లేదని.. మీకు వేరే చెప్పక్కర్లేదు.. కనక చెప్పట్లేదని.. రాసుకొచ్చాడు.