The Road Movie Explained in Telugu Trisha Dancing Rose Shabeer Santhosh Prathap
The Road: నిషా, విజయ్ ఇద్దరు భార్య భర్తలు రాత్రి టైమ్ లో కార్లో హైవే పై ప్రయాణం చేస్తూ ఉంటారు. భర్త మీద కోపంతో నిషా మాట్లాడుతుంది. అంతలో టైర్లో గాలి తక్కువగా ఉందని కారు రోడ్డు పక్కన ఉన్న మెకానికి షాప్‌లో ఆపుతాడు. తనకు చెప్పకుండా తన చెల్లెలు పెళ్లికి 20 సవరాల బంగారం చేయించాడని, దాన్ని కార్లో తీసుకొని ఈ టైమ్ లో ఊరెళ్లడం అవసరమా అని విజయ్ పై నిషా అరుస్తుంది. వీరి మాటలను కారు మెకానిక్ వింటాడు. రిపైర్ ఐపోయింది అని చెప్పి వాళ్లు ఇద్దరు కార్లో వెళ్లాగానే మెకానిక్ తన ఎవరికో ఫోన్ చేసి కార్లో ఉన్న బంగారం గురించి చెప్తాడు. కొద్ది దూరం వెళ్లగానే కారు ఆగిపోతుంది. ఈ సారి ఎందుకు ఆగింది అని నిషా అంటుంది. దిగి చూసిన విజయ్ కారు స్టార్ట్ అయ్యేలా లేదు అని ఆలోచిస్తాడు. అదేసమయంలో ఇద్దరు భార్య భర్తలు తోటదగ్గరకు వెళ్లాలని దారెంట నడుచుకుంటు కార్లో వీళ్లను చూసి ఏమైందని అడుగుతారు. కారు ట్రబుల్ ఇచ్చింది దగ్గర్లో మెకానిక్ ఉన్నాడా అని అడుగుతాడు విజయ్. పక్కూర్లో తనకు తెలిసిన మెకానిక్ ఉన్నాడని, కారు దగ్గర నిషాకు తోడుగా తన భార్యను వదిలేసి విజయ్ ని తీసుకొని వెళ్తాడు. అలా కొంత దూరం వెళ్లాకా కారు దగ్గరకు మరో నలుగురు వ్యక్తులు వస్తారు. నిషా భయపడుతుంది. ఇంకెంత దూరం వెళ్లాలి అని విజయ్ అడుగుతూ.. అంతలో తనకేదో అనుమానం వచ్చి విజయ్ వెనక్కి వస్తే కారు ఉండదు, నిషా ఉండు.. కట్ చేస్తే కారు ఆక్సిడెంట్ చేసి బంగారం తీసుకెళ్తారు. అదే కార్లో విజయ్, నిషా చనిపోయి ఉంటారు.
చదవండి:Tripti Dimri: తారక్‌పై కన్నేసిన యానిమల్ భామ..? ఏమందంటే..?
తరువాత సీన్లో మీరాను డాక్టర్ స్కానింగ్ చేస్తుంది. తన బేబీ గ్రోత్ చాలా బాగుందని చెప్తుంది. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ గా పని చేస్తున్న తన భర్త ఆనంద్ ఇకపై తనను జాగ్రత్తగా చూసుకోవాలని డాక్టర్ చెబుతుంది. తాను ప్రెగ్నెంట్ అయిన విషయం ఇంకా తన హస్బెండ్ కు తెలియదని రేపు వచ్చాక సర్ ప్రైజ్ ఇస్తానని చెప్తుంది. తరువాత కవిన్ బర్త్ డే సెలబ్రేషన్స్ కన్యకుమారిలో ప్లాన్ చేస్తున్నట్లు.. అక్కడికి కార్లో లాంగ్ డ్రైవ్ కు వెళ్లొచ్చా అని అడుగుంది మీరా. దానికి డాక్టర్ అలా కుదరదు… అది రోడ్ ట్రిప్ అని కావాలంటే వచ్చే ఏడాది గ్రాండ్ సెలబ్రేట్ చేసుకొండి మీ బేబీ కూడా ఉంటుంది అని చెప్తుంది.
నెక్ట్స్ సీన్లో మీరా ఆర్టికల్ రాసుకుంటు తన ఫ్రెండ్ బ్యాంక్ మేనజర్ ఉమాతో ఫోన్లో మాట్లాడుతుంది. మీరా ఆర్టికల్స్ బాగున్నాయి అని ఉమా అంటుంది. తన భర్త ప్రసాద్ కు తనకు ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నట్లు, తనకు తెలియకుండా తానేదో చేస్తున్నాడు అని చెప్తుంది ఉమ. ప్రసాద్ తో నేను మాట్లాడుతా నువ్వేమి తొందరపడకు అంటుంది మీరా. తరువాత కవిన్ భర్త్ డే సెలబ్రేషన్స్ చేయడం లేదా అంటే ఈ సారి కుదిరేలా లేదు.. తాను ప్రెగ్నెంట్ అని చెబుతుంది. దాంతో ఉమ కంగ్రాట్స్ చెబుతుంది. అదే సమయంలో కబిన్ స్కూల్ వ్యాన్ వచ్చిందని తరువాత కాల్ చేస్తా అంటుంది మీరా. తరువాత స్కూల్ వ్యాన్ దగ్గరకు వెళ్తుంది. కవిన్ బస్ దిగుతాడు. అందరు కవిన్ కు అడ్వాన్స్ విషేస్ చెప్తారు. కవిన్ థ్యాంక్స్ చెప్తాడు. మీరాతో కలిసి ఇంటికి వస్తు నాన్న ఎప్పుడొస్తాడు మమ్మి, షాపింగ్ చేయాలి అంటాడు. తరువాత తన బర్త్ డే ను గ్రాండ్ గా చేయాలని, మీరు లాస్ట్ ఈయర్ చెప్పింది గుర్తుందిగా అంటాడు కవిన్. అలాంటిది ఏది గుర్తుకు లేదే అని మీరా అంటుంది. తనకు గుర్తు ఉందని కవిన్ చెప్తాడు. సరే ఏం చేయాలో ఒక లిస్ట్ రాసి ఇవ్వు నాన్న రాగానే చెప్తా అంటుంది మీరా.. అలా అయితే నీకు చెప్పడం ఎందుకు డైరెక్ట్ నాన్నకే చెప్తా అంటాడు కవిన్. మీరా అలా నడుస్తూ ఒక్క సారిగా ఆగిపోతుంది. మార్నింగ్ నుంచి రాత్రి నిద్ర పోయే వరకు నీకు అమ్మ కావాలి, ఇప్పుడు నన్ను పక్కన పట్టేశావా అని అంటుంది. అది ఫ్రాంక్ చేశా అని మీరాను తీసుకొని వస్తాడు కవిన్.
తరువాత సీన్లో హోం వర్క్ చేయలేదని మీరా కొప్పడుతుంది. ఎప్పుడు చూసిన హోం వర్క్ అంటావు.. నా మైండ్ నిండా బర్త్ డే ట్రిప్ నే ఉంది. నేను కాన్సన్ ట్రేషన్ పెట్టలేకపోతున్నాను.. లైఫ్ ను ఎంజాయ్ చేయనియ్యవు అని ఇంట్లోకి వెళ్తాడు కవిన్. మీరా కూడా తన వెనుకాలే వెళ్లి డాడికి ఇంకా వర్క్ అయిపోలేదు, నీ బర్త్ డే ట్రిప్ కాన్సిల్ చేయమన్నాడు అని చెప్తుంది. జోక్ చేయకు మమ్మీ అని నీ మేకప్, డ్రెస్సింగ్ చూసి కనిపెట్టేసా ఈ రోజు డాడి వస్తున్నాడు అని అంటాడు. అదే సమయంలో కారు హార్న్ సౌండ్ విని సంతోషపడుతాడు. పరుగెత్తుకుంటూ వెళ్లి డాడిని హగ్ చేసుకుంటాడు. మీరా మీర్రర్ లో చూసుకుంటుంది. తనకు గేమింగ్ బాక్స్ గిఫ్ట్ గా తెచ్చానని చెప్పగానే సంతోషపడుకుంటూ కవిన్ పరుగెడుతాడు. అక్కడే మీరా నిలబడి ఉంటుంది. మీ కొడుకుకేనా గిఫ్ట్ నాకు లేదా అని అడుగుతుంది. నువ్వు ఇచ్చే గిఫ్ట్ ముందు నేను ఏం ఇవ్వగలను.. నువ్వు ప్రెగ్నెంట్ అన్న విషయం ముందే ఎందుకు చెప్పలేదు అని అంటాడు. తరువాత ఇద్దరు సంతోషంగా ఇంట్లోకి వెళ్తారు. కవిన్ గేమ్ ఆడుకుంటుంటాడు. కన్యకుమారికి కార్లో వెళ్లడానికి ఎంత సేపు సమయం పడుతుంది అని డాడిని అడుగుతాడు. దానికి 11 గంటలు పడుతుంది అని ఆనంద్ చెప్తాడు. వెంటనే డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తూ ఫ్లైట్‌లో వెళ్లడానికి అంత సమయం ఎందుకు అంటుంది. వెంటనే అవును కదా అని ఆనంద్ అంటాడు. దానికి మీరిద్దరు ఆటలు ఆడుకుంటున్నారా.. మనం రోడ్డు ట్రిప్ అనుకున్నాం కదా అంటాడు కవిన్. వాళ్లు కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తే.. రోడ్డు ట్రిప్పే బాగుంటుంది. పీకాక్స్ ను, సీనరీ, మౌంటైన్స్ అంటూ చెబుతుంటాడు. మీరా కాస్త ఆందోళన చెందుతుంది. అదే సమయంలో మీరాకు ఫోన్ వస్తుంది. మీ ఫ్రెండ్ కాల్ చేసింది అని ఫోన్ ఇస్తుంది. ఫోన్లో కూడా కవిన్ రోడ్ ట్రిప్ గురించే మాట్లాడుతుంటాడు. ఆనంద్ ను కన్విన్స్ చేస్తా అని అంటాడు.
తరువాత సీన్లో కవిన్ ను పడుకోబెట్టి ఇద్దరు లాన్ లో మాట్లాడుకుంటారు. ఈ సారి కవిన్ ను తీసుకొని కన్యాకుమారి ట్రిప్ కు వెళ్లు అని ఆనంద్ ను కన్విన్స్ చేస్తుంది. కట్ చేస్తే తన ఫ్రెండ్ ఉమకు ఫోన్ చేసి ఫస్ట్ వాళ్లిద్దరిని ట్రిప్ కు పంపిస్తున్నట్లు బాధ పడుతుంది. ఏం కాదు నేను చూసుకుంటా అని ఉమ అంటుంది. ఇదే ట్రిప్ లో నువ్వు, ప్రసాద్ మనసు విప్పి మాట్లాడుకోండి అని మీరా అంటుంది. తరువాత ఆనంద్ పిలిచాడు అని బయటకు వెళ్తుంది. టైమ్ కు తినండి, కవిన్ జాగ్రత్త, ఎక్కువగా ఫోన్ యూజ్ చేయకండి అని జాగ్రత్తలు చెప్తుంది. కవిన్ కార్లో నుంచి ఇంకా ఎంత సేపు అని అరుస్తాడు. తరువాత ఆనంద్ మీరాను ముద్దుపెట్టుకొని బయలు దేరుతాడు. కొద్దిదూరం వెళ్లి కారు ఆగుతుంది. కార్లో నుంచి కవిన్ వచ్చి మీరాను హత్తుకొని మిస్ యు చెప్పి వెళ్లి కారు ఎక్కుతాడు. కారు బయలు దేరుతుంది.
తరువాత సీన్లో పార్టీ బాగా జరిగిందా.. అని అడుగుతు ఒక బిజినెస్ మ్యాన్ తన టీమ్ తో మాట్లాడుతూ హడావిడిగా వస్తుంటారు. ఎవ్రీథింగ్ ఆల్ రైట్ మినిస్టర్ తో అపాయింట్ మెంట్ ఫిక్స్ చేయండి అని టీమ్ చెప్తారు. ఇంకో టు డేస్ ఇక్కడే ఉంటే అన్ని సెట్ అని టీమ్ అంటే.. నో వే మార్నింగ్ కల్లా చెన్నైలో ఉండాలి అని తన కార్లో ఎయిర్ పోర్ట్ కు వెళ్తున్నట్లు చెప్తాడు.
నెక్ట్స్ సీన్లో ఆనంద్, కవిన్ ఇద్దరు కార్లో వెళుతూ మీరా ఫోన్ కు వాయిస్ పెడుతుంటాడు. మీరు లేకుండా ఇళ్లు బోసిపోయిందని, నేను మీతో వచ్చుండాల్సింది అని మిస్ యు బోత్ అని వాయిస్ పెడుతుంది. ఇలాంటివి పెడితే డాడి కార్ యూ టర్న్ తీసుకొని వస్తాడు అని మమ్మీకి చెప్పు అని అంటాడు ఆనంద్. ఏంటి మీ రోమాన్స్ నేను చూస్తునే ఉన్నా అని కవిన్ అంటాడు. ఇద్దరు నవ్వుకుంటారు.
తరువాత బిజినెస్ మ్యాన్ కార్లో వెళుతూ యుఎస్ లో ఉన్న తన కొడుకుతో ఫోన్ మాట్లాడుతాడు. మీరు 60లో ఉన్నారు. ఇలా ఒంటరిగా కార్లో ప్రయాణించడం కరెక్ట్ కాదు అని కొడుకు అంటుండగా.. ఎవరు సిక్స్టీస్ ఇండియాకు రా నా సిక్స్ ప్యాక్స్ చూపిస్తా అని మాట్లాడుతుండగా.. కారు వెనుకాలే రెండు బైక్స్ ఫాలో అవుతూ కారు ముందుకు ఫాస్ట్ గా వచ్చేస్తాయి. దాంతో ఇడియట్స్ అని వాళ్లను తిడుతూ… తన కొడుకు కాల్ కట్ చేస్తాడు. తరువాత హర్న్ కొడుతాడు. ఎంతకు వాళ్లు సైడ్ ఇవ్వరు. తరువాత కారు రొడ్డుకు అటు ఇటు వెళ్తూ ఉంటుంది. అదే సమయంలో అపోజిట్‌లో ఆనంద్ వాళ్ల కారు వస్తుంది. పరిస్థితి గమనించిన ఆనంద్ జాగ్రత్తగా డ్రైవ్ చేస్తుండగా.. అయినా సరే ఆ బిజినెస్ మ్యాన్ కారు వచ్చి ఆనంద్ కారును ఢీ కొడుతుంది. రెండు కార్లు రోడ్డు పక్కన పడుతాయి. కవిన్, ఆనంద్ ఇద్దరికి తీవ్ర గాయాలు అవుతాయి. కట్ చేస్తే డాక్టర్స్ ఆ రెండు డెడ్ బాడీస్ గురించి పోలీసులకు ఇన్ఫామ్ చేశారా, వారి ఫ్యామిలీకి ఇన్ఫామ్ చేశారా అని అడుగుతుంటాడు. అక్కడికి ఉమ, ప్రసాద్ ఇద్దరు పరిగెత్తుకుంటు వస్తారు. కవి బ్రైయిన్ డెడ్ అయినట్లు డాక్టర్ చెప్తాడు. దాంతో ఉమ ఏడుస్తుంది. ఈ విషయాన్ని మీరాకి ఎట్ల చెప్పాలి అని ప్రసాద్ ఆలోచిస్తాడు. తరువాత సీన్లో మీరాకు ఉమ కాల్ చేసి యాక్సిడెంట్ విషయం చెబుతుంది. ఉమ వెంటనే కార్లో బయలు దేరి వస్తుంది. తన ఫ్యామిలీకి ఏం కాకుడదు.. ఎంత ఖర్చు అయిన పర్లేదు అని ఏడ్చుకుంటు కారు డ్రైవ్ చేస్తుంది. ఆసుపత్రికి పరుగెత్తుకుంటు మీరా వస్తుంది. అలా పరుగెడుతూ ఉమను చూసి ఏం జరిగింది అని ఏడుస్తుంది. ఆనంద్ ను, కవిన్ ను చూడాలాని ఆరుస్తుంది. డాక్టర్ ల మీద అరుస్తుంది. దాంతో సారీ మీరా వారిద్దరిని కాపాడలేకపోయాము అని డాక్టర్ చెబుతాడు. దాంతో మీరా ఒక్క సారిగా కిందపడిపోతుంది.
తరువాత సీన్లో కాలేజీలో స్టూడెంట్స్ క్లాస్ వినుకుంటూ తమ ప్రోఫెసర్ అందంగా ఉంటాడు అని మాట్లాడుకుంటారు. ఆ గ్యాంగ్ లో ఉన్న ప్రియ తాను నావాడు అని మీరు ఎవరు లైన్ వేసిన ఊరుకొను అంటుంది. వాళ్లు తనను ఆటపట్టిస్తూ అందరు నవ్వుతారు. ప్రోఫెసర్ మాయ చెప్పడం ఆఫీ వాళ్లను చూస్తాడు. అందరు నిలబడుతాడు. తరువాత ప్రియ కూడా నిలబడుతుంది. అందరిని బయటకు వెళ్లమంటాడు. ప్రియ తననే చూస్తు వెళ్తుంది. క్లాస్ అయిపోయిన తరువాత తనకు డౌట్స్ ఉన్నాయని, ఫ్రీగా ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు అడిగుతా అని అంటుంది. నెక్ట్స్ సీన్లో మాయ బస్సునుండి ఊర్లో దిగుతాడు. తరువాత సైకిల్లో తన ఫ్రెండ్ తో కలిసి వెళ్తాడు. ప్రియ గురించి తన ఫ్రెండ్ కు చెప్తాడు. నీకు ప్రేమ గురించి తెలియదు అని తన ఫ్రెండ్ అంటాడు. ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనది అంటే ప్రేమ ఇంకా పవిత్రమైనది అని తన ఫ్రెండ్ చెల్లా అంటాడు. అదే సమయంలో మాయ అన్నదమ్ములు ఆస్తి కోసం గొడవపడుతుంటారు. వాళ్ల నాన్న కేరళ అమ్మాయిని రెండో పెళ్లి చేసుకుంటే మాయ పుట్టాడని, అతని చదువులకే అప్పులు చేశాడని వాళ్లు అంటుంటే మాయ బాధపడుతాడు.
తరువాత సీన్లో కాలేజీలో పేపర్స్ ఇస్తుంటే ప్రియా క్లాస్ లో ఉండదు. అదేసమయంలో ప్యూన్ వచ్చి ప్రిన్స్ పల్ పిలుస్తున్నాడని చెప్తాడు. కట్ చేస్తే ప్రియ నీ సబ్జెక్ట్ ఫెయిల్ అయిందని, ఈవినింగ్ ఎక్స్ ట్రా వన్ హవర్ క్లాస్ తీసుకొమని చెప్తాడు. దానికి ఒప్పుకున్న మాయ మరో నలుగురు అమ్మాయిలు కూడా ఫెయిల్ అయ్యారని వారికి కూడా తీసుకుంటానని చెప్తాడు. దాంతో ప్రియా అలుగుతుంది. అందరికి కలిసి తీసుకో అని చెప్పి ప్రిన్సిపల్ వెళ్లిపోతాడు. తరువాత ప్రియ నీకు అర్థం కాదు అని చెప్పి వెళ్లిపోతాడు. తరువాత సీన్లో మాయ తనను అవైడ్ చేస్తున్నాడని ఈగో ఫీల్ అవుతుంది. తన ఫ్రెండ్స్ ప్రియను రెచ్చగొడుతారు. రెండు రోజుల్లో మాయ చేత లవ్ యు చెప్పించుకుంటా అని ఛాలెంజ్ చేస్తుంది.
నెక్ట్స్ సీన్లో ఎగ్జామ్స్ జరుగుతుంటాయి. ప్రియ ఆలోచిస్తుంంది. అదే సమయంలో మాయ అటుగా వెళ్లడం చూసి ఇన్విజిలేటర్ దగ్గర పర్మిషన్ తీసుకొని లైబ్రరీకి వెళ్లి తనతో మాట్లాడాలి అని చెప్తుంది. ముందు వెళ్లి ఎగ్జామ్ రాయి అని అక్కడినుంచి వెళ్లిపోతాడు. అక్కడ డోర్స్ లాక్ చేసి ఉంటాయి. ప్రియానే లాక్ చేయమన్నట్లు చెప్తుంది. తరువాత లవ్ ప్రపోజ్ చేస్తుంది. దానికి మాయ ఒప్పుకోడు. పైగా నువ్వు స్టూడింట్ వి, నాకు మంచి పేరు ఉంది ఇది కుదరదు అని చెప్తాడు. అదే సమయంలో డోర్ తీయండి అని బాదుతాడు. టీచర్స్ వచ్చి డోర్ తీస్తారు. మాయ బయటకు వస్తాడు. ప్రియ ఏడ్చుకుంటూ వస్తుంది. ప్రోఫెసర్స్ మాయపై కొప్పడుతారు. ప్రియను పిలిచి నువ్వు ఇచ్చిన కంప్లైంట్ కరెక్టే కదా.. మాయ నీతో తప్పుగా ప్రవర్తించడా అని ప్రిన్సిపల్ అడుగుతాడు. అవును అని ప్రియ చెప్తుంది. మాయ వెక్కి వెక్కి ఏడుస్తాడు. కట్ చేస్తే పోలీసు స్టేషన్లో మాయ ఉంటాడు. తన ఫ్రెండ్, నాన్న కలిసి పోలీసులతో మాట్లాడుతారు.
కట్ చేస్తే ఆసుపత్రలో ఉమ, ప్రసాద్ డాక్టర్ తో మాట్లాడుతారు. మీరా రెండు వారాలు కోమాలో ఉండడం వలన తను చాలా వీక్ గా ఉన్నట్లు, తన ప్రెగ్నెంట్ కూడా పోయిందని చెప్తాడు. దాంతో మీరా ఏడుస్తుంది. కట్ చేస్తే మాయ తన నాన్న, ఫ్రెండ్ తో కలిసి నడుచుకుంటు వస్తారు. అలా కొద్దిదూరం వచ్చాకా మాయ ఏడుస్తాడు. తాను ఏ తప్పు చేయలేదని గట్టిగా ఏడుస్తాడు. మరో సీన్లో మీరా ఇంటికి వస్తుంది. మాయను ఊర్లో అందరు అవమానిస్తారు. వాళ్లనాన్న కూడా బాధ పడుతాడు. మరో సీన్లో త్రిషకు తన కొడకు, భర్త గుర్తుకువచ్చి ఏడుస్తుంది. తరువాత చేతిని కోసుకుంటుంది. ఉమ వచ్చి చూస్తుంది. తరువాత సీన్లో మాయ వాళ్ల నాన్న తనకు బొట్టుపెట్టి దేవుడిని మొక్కుతాడు. తరువాత ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటకు రావాలని ఉమ తన మీరాతో అంటుంది. నెక్ట్స్ సీన్లో యాక్సిడెంట్ జరిగిన చోటుకు ఫ్లవర్స్ తీసుకొని వెళ్లి అక్కడ పెట్టి మీరా ఏడుస్తుంది. అక్కడి కవిన్ బైనక్యూలర్ దొరుకతుంది. వర్షం స్టార్ట్ అవుతుంది. కార్లో కూర్చుంటారు. కారు స్టార్ట్ అవదు. వర్షం పడుతుంది. అంతలో అక్కడికి ఒక అమ్మాయి వచ్చి వారిని ఇంటికి తీసుకెళ్తుంది. వారికి టీ ఇచ్చి ఇంట్లో ఉండమని వారు అడుగుతారు. ఆ రోజు జరిగిన ఆక్సిడెంట్ గురించి చెప్తూ బాధ పడుతాడు. తరువాత మీరాకు ఆనంద్, కవిన్ కల్లో వస్తారు. తాను బయపడి లేచి యాక్సిడెంట్ జరిగిన ప్రదేశానికి వెళ్తుంది.
తరువాత సీన్లో ఒక కారు పెట్రోల్ కొట్టించుకుంటూ కార్లో డబ్బులు ఉన్నట్లు మాట్లాడుతాడు. అది బంక్ అతను విని తన మనుషులకు ఫోన్ చేస్తాడు. అదే సమయంలో మీరా లేచి యాక్సిడెంట్ అయిన చోట నిలబడి చూస్తుంది. అంతలో కారు యాక్సిడెంట్ అయిన సౌండ్ వినపడి వెనక్కి తిరిగి చూస్తుంది. కార్లో ఉన్న వ్యక్తిని బయటకు తీయడానికి ట్రై చేస్తుంది. హెల్ప్ అడగడానికి ప్రయత్నిస్తుంది. వెనక కారు ఉంటే ఎవరన్నా ఉన్నారని చూడడాని వెళ్లి వచ్చేలోపే యాక్సిడెంట్ అయిన కారు అక్కడ ఉండదు. దాంతో దాన్ని వెతుక్కుంటూ అలా ముందుకు వెళ్తుంది. అడవి లాంటి ప్రదేశంలో కొంత మంది కారు ప్రమాదం అయిన అతని గొంతును ఒక లేడీ పిసుకుతుంది. పక్కనే ఉన్న మనుషులు మీరాను కూడా చంపేద్దామా అని మాట్లాడుకుంటారు. కట్ చేస్తే మీరా రొడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంది. తనను వెతుక్కుంటూ ఉమ, రోజ టీవీఎస్ లో వస్తారు. వారిని తీసుకొని పోలీసుస్టేషన్ కు వెళ్తారు. పోలీసులకు చెబితే నమ్మరు. ఏ ఆధారాలు లేకుండా ఏమని కేసు రాసుకోవాలి అని మాట్లాడుతారు. డీఎస్పీతో మాట్లాడుతామని లేచి వెళ్లిపోతుంటే వారిని ఆపి, కార్లో ప్రమాదం జరిగిన చోటుకు తీసుకెళ్తాడు. అక్కడ ఏ ఆనవాళ్లు ఉండవు. ఎస్ ఐ టైమ్ వేస్ట్ అయిందని అంటూ ఫోన్ మట్లాడుతాడు. మీరు ఇంత గట్టిగా చెబుుతున్నారంటే ఇక్కడ ఏదో జరిగింది అని హెడ్ కానిస్టేబుల్ అంటాడు. కారు నెంబర్ కాని, కలర్ కాని గుర్తుందా అంటే మీరా ఆలోచిస్తుంది. అంతలో రెడ్ కలరా అని హెడ్ తన చేయిని చూసుకుంటూ అంటాడు, మీరా అలానే అవాక్కై చూస్తోంది.
తరువాత సీన్లో ప్రమాదం చేసిన గ్యాంగ్ మీటింగ్ పెట్టుకుంటారు. అంతా కరెక్ట్ గానే జరిగింది ఆ అమ్మాయి అక్కడికి ఎలా వచ్చిందో తెలియదు అని ఒకడు అంటుంటాడు. కొంచెం అయితే మేమంతా దొరికే వాళ్లము అని ఆ గ్యాంగ్ లో లేడి లేచి అతన్ని తన్ని సుత్తితో తలపై కొట్టి చంపేస్తుంది. అక్కడే కారును తగలబెడుతారు.
తరువాత సీనల్లో మీరా కారు డ్రైవ్ చేస్తూ ఆలోచిస్తుంది. చాలా మంది ఈ రోడ్డులో ప్రమాదానికి గురై చనిపోతుంటారు అని రోజ వాళ్ల నాన్న మాటలు గుర్తుకువస్తాయి. తరువాత కారణం ఏంటో కనుకోవాలని ఫిక్స్ అవుతుంది. ది రోడ్ టైటిల్ పడుతుంది.
నెక్ట్స్ ఊరుబయట చెట్టుకుంద మాయ బాధపడుతూ కూర్చుంటాడు. తండ్రి, ఫ్రెండ్ టిఫిన్ తీసుకొని వస్తారు. ఇలా బాధ పడేబుదులు తనను చంపేయ్ అని తన ఫ్రెండ్ అంటే తండ్రి అతన్ని తిట్టి పంపిస్తాడు. తరువాత మాయతో కూర్చొని తను చిన్నప్పటి నుంచి పడిన కష్టాన్ని చెబుతాడు. తనలాగ తన కొడుకులు అవకూడదు అని గొప్పగా చదివించాలనుకున్నట్లు చెప్తాడు. చదువుకొని గొప్ప ఆఫీసర్ అవుతాగా అని మాయను అడుగుతాడు. తరువాత సీన్లో మాయ ఉన్నాడా అని తన ఫ్రెండ్ వచ్చి అతన్ని తీసుకొని తన చిన్నాయిన దగ్గరకు తీసుకెళ్తాడు. గవర్నమెంట్ కాలేజీలో ప్రెఫసర్ పోస్ట్ ఉందని, 6 లక్షలు కావాలని చెప్తాడు. ఇళ్లు తాకట్టు పెట్టి జాబ్ చేయాలని చూస్తాడు. తరువాత అందరితో మాట్లాడి ఇళ్లు తాకట్టు పెట్టి డబ్బు తీసుకెళ్లి మంత్రికి ఇస్తారు. తాను ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతుండగా, మినిస్టర్ చనిపోతాడు. తరువాత జాబ్ కోసం తిరిగి తిరిగి అలిసిపోతాడు. వేరే మినిస్టర్ మళ్లీ డబ్బులు అడుగుతాడు. దాంతో అతని పీఏను కొడుతాడు. ఇక తనకు ఉద్యోగం రాదని చెప్తాడు. ఇదే విషయాన్ని మాయ వాళ్ల నాన్న కాళ్ల మీద పడి చెప్తాడు. వాళ్ల నాన్న కూడా బాధ పడుతాడు. ఆ బాధతో చెట్టుకు ఊరేసుకొని చనిపోతాడు. అంత్యక్రియలు అయిపోయిన తరువాత మాయ అన్నదమ్ములు ఇంట్లోనుంచి వెలగొడుతారు. తన ఫ్రెండ్ తన గుడిసెకు తీసుకుపోతాడు. అక్కడ మాయ చాలా డిస్టర్బ్ గా ఉంటాడు. ఏడుస్తాడు. ఒక రోజు చనిపోవాని రోడ్డులో లారీకి అడ్డంగా నిలుచుంటాడు.
కట్ చేస్తే మాయ ఈ ప్రమాదాల గురించి తెలుసుకోవాలాని ఉమతో చెబుతుంది. ఎన్ హెచ్ 44 హైవై వేశాక చాలా వరకు ఆక్సిడెంట్స్ తగ్గాయని, కాని ఈ పర్టిక్యూలర్ ప్లేస్ లో మాత్రం ప్రమాదాలు జరుగుతున్నాయిని తాను కలిసిన విక్డిమ్ ల గురించి చెప్తుంది. ప్రమాదానాకి గురయిన కొన్ని కార్లలో బంగారం, డబ్బులు మిస్ అయ్యాయి అని వాటిని పోలీసులు ఇంత వరకు ఎవరు రికవరీ కూడా చేయలని చెబుతుంది. రోడ్డు ఇక్కడ ఉంటే అంత దూరంలో ఉన్న చెట్టుకు ఎలా ఆక్సిడెంట్ జరుగుతుంది అని రోజ అడుగుతుంది. బావిలో పడ్డ కారు రెండు రోజుల తరువాత దొరికింది ఇలా ఎన్నో సమాధానం లేని ప్రశ్నలు ఉన్నాయని ఉమతో చెబుతుంది మీరా. అదే సమయంలో మీరకు ఫోన్ వస్తుంది. పోలీస్టేషన్ లో బిజినెస్ మ్యాన్ కొడుకు మీరాకు డబ్బులు ఇస్తా అని మాట్లాడుతాడు. దానికి ఉమ ప్రాణాలు తిరిగి వస్తాయా అని అరుస్తుంది. ఇది మానవత్వం ఇస్తున్నాని ఆ ప్రమాదంలో వాళ్ల నాన్న కూడా చనిపోయినట్లు చెప్తాడు. కోర్టు చుట్టు తిరిగి టైమ్ వేస్ట్ చేసుకోవడం ఎందుకు మీకు ఏదైనా కావాలంటే అడగండి అని ఎస్ఐ అంటాడు. దానికి మాకు డబ్బులు అవసరం లేదు కాని ఎప్పుడు తాగి డ్రైవ్ చేయకండి అని చెప్పి వెళ్లిపోతారు. పోలీసు స్టేషన్ బయట వారిని కలిసి ఆ రోజు వాళ్ల నాన్న తాగలేదు అని చెప్తాడు. దాంతో మీరా అనుమానపడుతుంది. పోస్ట్ మర్టమ్ రిపోర్ట్ లో హల్కహాల్ అని ఉందని ఆ డాక్టర్ గురించి కనుక్కొని అతని దగ్గరకు వెళ్తారు మీరా, హెడ్ కానిస్టేబుల్. తరువాత అతని మేడపై కత్తి పెడుతుంది. అతను నిజం చెప్తా అంటాడు. తన బాడీలో ఆల్కాహాల్ ఉందని అయితే అది అరగకముందే చనిపోయాడు అని చెప్తాడు. దాంతో తన కారును చెక్ చేయండి మీకు ఏదైనా ఎవిడెన్స్ దొరకొచ్చు అంటే మొత్తం కారును ఫారెన్సిక్ టీమ్ చెక్ చేస్తుంది.
కార్లో ఎలాంటి ఆల్కాహాల్ ఎవిడెన్స్ లు లేవని, కాని ఆర్టిఫిషల్ గా పంక్చర్ చేసే గ్యాల్ట్రా దొరికిందని తనకు ఇస్తారు. అదే సమయంలో మీరు చెప్పిన ఎరుపు రంగు కారు మిస్సింగ్ కేసు గురించి పోలీసు స్టేషన్లో కేసు నమోదు అయిందని హెడ్ చెప్తాడు. తరువాత మీరా, హెడ్ ఒక అతన్ని వెతుక్కుంటూ ఒక ప్రదేవానికి వెళ్తారు. అక్కడ ఒక అతను వెనక్కి తిరగి చూసి లోపలికి వెళ్తాడు. తరువాత అతన్ని వెతుక్కుంటూ ఆ బండల మధ్య తిరుగుతారు. అంతలో హెడ్ ను ఒకడు కొడుతాడు. అదే సమయంలో మీరా ఎదురుపడుతుంది. తనను కొడుతాడు. తలపై బండతో కొట్టి చంపుదాము అని బండ తీసుకురాగానే అతన్ని ఎటాక్ చేస్తుంది. ఐరన్ తో అతని కాళ్లపై, చేతులపై పొడుస్తుంది. కట్ చేస్తే అతన్ని కిడ్నాప్ చేసి నిజం చెప్పమని స్క్రూ డ్రైవర్ తో పొడుస్తుంది. అతను నిజం చెబుతా అంటాడు.
తాను మార్చరీలో వార్డు బాయ్ గా పనిచేస్తాడు. తన పేరు దొర అని చెప్తాడు. అక్కడ పని చేస్తే డబ్బులు సరిపోవు. దాంతో ఊర్లో అప్పులు చేస్తాడు. తన వైఫ్ తనను సరిగ్గా చూసుకోదు. అలాంటి సమయంలో తన అకౌంట్లో లక్ష రూపాయలు పడుతాయి. అలా మూడు సార్లు పడుతాయి. వాటితో తన భార్యకు నగలు కొనిస్తాడు. అలా వచ్చిన డబ్బును ఆ బండల దగ్గర దాచిపెడుతాడు. ఒక రోజు ఒక ప్రయివేట్ నెంబర్ నుంచి ఫోన్ వచ్చిందని చెప్పింద చేయకపోతే చస్తావు అని బెధించినట్లు చెప్తాడు. ఆ రోజు నుంచి వారు చెప్పిన డెడ్ బాడీలకు మందు తాగిస్తున్నట్లు చెప్తాడు. అంతకు మించి ఏం తెలియదు అని దొర అంటాడు. మీరా ఆలోచనలో పడుతుంది. తన అకౌంట్ నెంబర్ అడుగుతుంది.
తరువాత సీన్లో మేకలు కాచుకుంటున్న ఒక వ్యక్తి ఆకౌంట్లో నుంచి మ్యార్చరీలో పనిచేసే దొర అకౌంట్ కు అమౌంట్ ట్రాన్స్ ఫర్ అయిందని తెలిసి అతన్ని అడిగితే నాకు ఏమి తెలియదు.. మా ఊర్లోకి ఒక వ్యక్తి వచ్చి అందరికి బ్యాంక్ అకౌంట్స్ తెరిచిస్తాడు. అతపి పేరు భాస్కర్ అని, గ్యాస్, ఆధార్ ఇలా అన్ని చేసిపెడుతుంటాడు అని చెప్తాడు. ఎంతో మంచోడు అని చెబుతాడు. ఆ మంచోన్ని ఇక సారి కలువచ్చా అని… గ్రామంలో అందరికి బ్యాంక్ అకౌంట్స్ ఇప్పిస్తా అని మాట్లాడుతున్న భాస్కర్ ను హెడ్ కానిస్టేబుల్ అనుమానించి అడిగితే భాస్కర్ పారి పోతాడు. వెంటనే హెడ్ వెంబడిస్తాడు. కానిస్టేబుల్ కొట్టి అరటితోటలోకి దమ్ము తీసుకుంటుంటే మీరా వచ్చి భాస్కర్ ను కొడుతుంది. కట్ చేస్తే అతని ఇంటికి వెళ్తారు మీరా, హెడ్ కానిస్టేబుల్. అతని ఇళ్లు మొత్తం బ్యాంక్ అకౌంట్స్, సిమ్స్ ఉంటాయి. అతన్ని అడిగితే నాకు కాల్ వస్తుంది ఎవరి అకౌంట్లో వేయమంటే వారి అకౌంట్లో వేస్తాను. ఒక సారి వాడిని అకౌంట్ ను మూడు నెలల వరకు వేయను. ఇది ఒక సీక్రెట్ టాస్క్ అని చెబుతాడు. ఇక తనకు డబ్బు అకౌంట్ నుంచి రాదు ఒక లోకేషన్ లో డబ్బులు పెట్టినట్లు మెసేజ్ చేస్తారు. అక్కడికి వెళితే బ్యాగ్ లో డబ్బు ఉంటుంది అని చెప్తాడు. మీరా మళ్లీ ఆలోచనలో పడుతుంది. అక్కడికి తన వైఫ్ వచ్చి వాళ్ల బావ చాలా మంచోడు అని చెబుతుంది.
తరువాత సీన్లో డార్క్ బ్యాంకింగ్ గురించి ఉమ చెబుతుంది. ఇది చాలా పెద్ద నెట్ వర్క్ అని, ఇందులో పెట్రోల్ బంక్ లో పని చేసేవాడు, పంక్చర్ షాప్ లో పనిచేసేవాడు, పాన్ షాప్ ఇలా హైవేను ఆనుకొని పనిచేసేవారు ఉన్నట్లు ఆలోచిస్తారు. ఇంత నెట్ వర్క్ ను ఒక్కడే హ్యాండిల్ చేస్తున్నట్లు మీరా చెబుతుంది. ఇంతకన్నా ముందు ఆ ముగ్గురిని ఆసుపత్రిలో అడ్మిట్ చేసింది ఎవరో తెలియాలి అని ఆలోచిస్తుంది. కట్ చేస్తే అడవిలో కట్టెలు కొడుతున్న రోజ దగ్గరకు మీరా వెళ్తుంది. ఆ ముగ్గురిని ఆసుపత్రిలో నువ్వే అడ్మిట్ చేసినట్లు ఎందుకు చెప్పలేదు. ఇంకా ఏ నిజాలు దాచావు అని అడుగుతుంది. అదే సమయంలో హెడ్ ఫోన్ చేసి మనీ లోకేషన్ వచ్చినట్లు చెప్తాడు. తరువాత కార్లో వెళుతూ ఉమకు ఫోన్ చేస్తుంది. ఎలాంటి ప్రశ్నలు అడగకుండా చెప్పింది చేయి అంటుంది. తరువాత హెడ్ కానిస్టేబుల్ తీసుకొని జీపీఎస్ లోకేషన్ దగ్గరకు వెళ్తుంది. అక్కడ ఉన్న నీటిలోని మూట తీసుకొని చూస్తుంది. అక్కడ కవిన్ ట్యాబ్ దొరుకుతుంది. అందులో కవిన్ వీడియో చూసి ఏడుస్తుంది. అంతలో వెనక నుంచి ఒక గ్యాంగ్ వచ్చి మీరాను, హెడ్ ను కొడుతారు. వారిని కట్టేసి గోతులు తీస్తారు. అక్కడే ప్రస్తాద్ కనిపిస్తాడు. మాయ్ ఫ్రెండ్ చెల్లా కూడా అక్కడే ఉంటాడు. వీరిద్దరు కలిసి ఇదంతా చేసినట్లు చెప్తారు.
ఇదే విషయాన్ని రోజ మీకు చెప్తుంది. వారిని ఆసుపత్రిలో చేర్పించినప్పుడు కారును మాయం చేసిన ప్రసాద్ అక్కడే ఉన్నాడని తెలసి భయం వేసింది అని చెప్తుంది. ఇది చాలా పెద్ద సామ్రాజ్యం అని ప్రసాద్, చెల్లా మాట్లాడుతారు. అంతలో అక్కడే పొదల్లో దాక్కున్న ఉమ లేచి గన్ తో అందరిని బెధిరిస్తుంది. ఇష్టం వచ్చినట్లు కాలుస్తుంది. మీరాను, హెడ్ కానిస్టేబుల్ కట్లను విప్పుతుంది. పారిపోతారు. ఆ గ్యాంగ్ వెనుకాల తరుముతుంటారు. కొంతదూరం వెళ్లాకా మీరా కింద పడిపోతుంది. ఉమ, హెడ్ ఒక బండచాటున దాక్కుంటారు. తరువాత మీరాను ఆ గ్యాంగ్ లోని ఒక లేడీ కొట్టడానికి ట్రై చేస్తుంది. మీరా తనను కొడుతుంది.
అప్పుడు అని టైటిల్ పడుతుంది. మాయను వెతుకుతూ చెల్లా గుడిసే దగ్గరకు వస్తాడు. అక్కడ ఎవరు ఉండరు. అలా మాయను వెతుకుతూ అక్కడ ఇక్కడ తిరుగుతు ఒక ఇంటి వెనుకకు వెళ్లితే అక్కడ మాయ ఏడుస్తూ కనిపిస్తాడు. ఏం జరిగింది రా అంటే నేను ఒక పెద్ద తప్పు చేశానని చెప్తాడు. తను చనిపోదామనుకొని రోడ్డు మీద నిలబడినప్పుడు.. ఎదురుగా వచ్చిన లారీ మాయను తప్పించి కారును ఢీ కొడుతుంది. అక్కడే కార్లో డబ్బు నగలు ఉంటాయి. వాటిని తీసుకొని మాయ వస్తాడు. అదే విషయాన్ని ఫ్రెండ్ కు చెప్పి ఏడుస్తాడు. దానికి ఫ్రెండ్ అతని సర్ధి చెప్తాడు. చావు చివర వచ్చిన అవకాశం ఇది అని ఇదే వృత్తిగా పెట్టుకుంటారు. అలా ఆక్సిడెంట్ అయిన వాహానాల్లో ఉన్న నగలు, డబ్బు తీసుకుంటారు. కొద్ది రోజులకు వాళ్లే యాక్సిడెట్లు చేయడం మొదలు పెడుతారు. అలా రాళ్లు అడ్డం పెట్టి, గ్యాల్ట్రా పిన్స్ వేసి దోచుకుంటారు. తరువాత తన అన్నల నుంచి ఇళ్లు కొంటారు. ఇంకో పెద్ద ఇల్లు, కారు కొంటారు. తరువాత బిజెనెస్ పెంచాలని ప్లాన్ గీస్తాడు మాయ.
కొటమంగ అనే దారిదోపిడి గ్యాంగ్ ను తమకోసం పనిచేస్తుందిని, ఈ బిజినెస్ ను చెల్లాతో పాటు ప్రసాద్ తన పాత స్నేహితుడు కూడా చూసుకోండి అని చెప్పి మాయ వేరే పనిమీద వెళ్తాడు. ఇప్పుడు అనే టైటిల్ పడుతుంది. కార్లో ప్రసాద్ వెళ్తుంటే మీరా, ఉమ చూస్తారు. తరువాత ఒక ప్లేస్ కు వెళ్తారు. ప్రసాద్ మీద అనుమానంతో ఈ ప్లేస్ ను ఒక సారి కనిపెట్టాని చెప్తుంది. తరువాత అక్కడ ఒక ల్యాప్ ట్యాప్ దొరుగుతుంది. దాన్ని తెరిచి చూస్తే 500 కేజీల గోల్డ్ ఇదే హైవే మీదుగా వెళ్తుందని దానికోసం ఆ రోజు బిజినెస్ మ్యాన్ ను టార్గెట్ చేసి ఈ ల్యాప్ టాప్ ను తీసుకెళ్లారు అని చెప్తుంది. ఇదే విషయాన్ని మాయ తన పార్ట్ నర్స్ తో చెప్తాడు. తరువాత ప్లాన్ ఎగ్జ్యూట్ చేస్తారు. కారును హైవేపై పంక్చర్ చేస్తారు. గంగధర్ గన్ బాడీ గార్డ్ ను కాల్చి, గంగధర్ ను కిందికి దిచ్చి కార్లో వెలుతూ మాయకు ఫోన్ చేస్తారు. గంగదర్ దిగిపోయాడు అనగానే వెంటనే మీరు కూడా దిగిపోండి అని మాయ అంటుండగా.. గంగధర్ కారును పేల్చేస్తాడు.
తరువాత ఇదే విషయాన్ని మాయకు ఫోన్ చేసి చెబుతుంది మీరా. మాయ కోపంతో మీర దగ్గరకు ఉన్న ప్లేస్ కు వెళ్తాడు. అదే విషయన్ని ఉమకు చెబితే వద్దు అంటుంది. అదే సమయంలో మాయ వస్తాడు. తనను గన్ తో కాలుస్తుంది. మాయ తప్పించుకుంటు ఉంటాడు. మీరా అలా షూట్ చేసుకుంటూ ఇంట్లోకి వెళ్తుంది. మాయ ఫాలో అవుతాడు. హైవేపై ఎంతో మంది ఎన్నో ఆశలతో వెళుతుంటారు. అని మీరా అంటుంది. ఇక్కడ అందరు డబ్బు కోసమే పనిచేస్తున్నారు. నేను డబ్బుకోసమే చంపుతున్న అది ఉంటే మర్యాద ఉంటుంది అని చెప్తాడు. ఇక మీరాను బయటకు రప్పించడానికి తన భర్త, కొడుకు వాళ్ల మనుషులే చంపినట్లు చెప్తాడు. దాంతో కోపం తెచ్చకున్న మీరా కాలుస్తు బులెట్స్ అన్ని కాళి చేస్తుంది. మాయను చెంపమీద కొడుతుంది. మీరా చేయిని ఆపి మాయకొడుతాడు. కాలితో తన్నుతాడు. వెళ్లి తన గోల్డ్ ను చూస్తాడు. అక్కడే ప్రోఫేసర్ అంటుంది. ఎవరా అని చూస్తే.. ప్రియ కనిపిస్తుంది. తను గంగధర్ రెండో వైఫ్.. ఈ విషయం తెలుసుకున్న మీరా తనను ట్రాప్ చేసి అక్కడికి తీసుకొస్తుంది. ఆ సౌండ్ విని మాయ కిందపడిపోతాడు. తరువాత లేచి ప్రియను చంపుదామనే లోపే గోల్డ్ బిస్కెట్ తో మాయను కొట్టి చంపేస్తుంది మీరా. ఇది ది రోడ్ మూవీ.