సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ మూవీని ఏ ముహూర్తాన మొదలు పెట్టారో గానీ.. ఆది నుంచి అన్నీ అడ్డంకులే ఎదురవుతున్నాయి. అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చిన తర్వాత చాలా కాలానికి పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఇక లాంచ్ అయినా తర్వాత సెట్స్ పైకి వెళ్లడానికి కూడా చాలా సమయం తీసుకుంది. ఇక షూటింగ్ మొదలుపెట్టిన తర్వాత ఫస్ట్ షెడ్యూల్ దగ్గరే ఆగిపోయింది. ఇక అప్పటి నుంచి తిరిగి సెట్స్ పైకి వెళ్లడం లేదు. మహేష్ తల్లి, దండ్రులను కోల్పోవడంతో బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. అయితే ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాడు మహేష్. ప్రస్తుతం దుబాయిలో యాడ్ షూటింగ్లో ఉన్నాడు. ఆ తర్వాత ఈ నెల సెకండ్ వీక్‌లో SSMB28 సెకండ్ షెడ్యూల్ మొదలు పెట్టబోతున్నట్టు వినిపించింది. అయితే ఇప్పుడు మరోసారి షూటింగ్ వాయిదా పడిందని తెలుస్తోంది. అందుకు హీరోయిన్ పూజా హెగ్డే కారణమని అంటున్నారు. ప్రజెంట్ బుట్టబొమ్మకు డేట్లు అడ్జెస్ట్మెంట్ అవడం లేదట. దాంతో SSMB28 షూటింగ్ క్యాన్సిల్ అయిందని అంటున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాతే ఈ సినిమా తిరిగి పట్టాలెక్కనుందట. ఈ గ్యాప్‌లో దుబాయ్‌లో మహేష్‌తో కలిసి తమన్, త్రివిక్రమ్ మ్యూజిక్ సిట్టింగ్ వేసినట్టు టాక్. దీంతో మహేష్ ఫ్యాన్స్ కాస్త నిరాశకు గురవుతున్నారు. ఇలా అయితే నెక్ట్స్ ఇయర్ ఆగష్టులో కూడా ఈ సినిమా రిలీజ్ అవడం కష్టమంటున్నారు. ఇప్పటికే ఏప్రిల్ 28 నుంచి ఆగష్టు 11కు ఈ సినిమాను పోస్ట్ పోన్ చేసినట్టు వినిపిస్తోంది. మరి SSMB28 ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.