Mallidi Vasishta : షాకింగ్.. ‘బింబిసార 2’ డైరెక్టర్ అవుట్!?
Mallidi Vasishta బ్లాక్ బస్టర్ మూవీ బింబిసార సీక్వెల్ నుంచి డైరెక్టర్ మల్లిడి వశిష్ట అవుట్ అయ్యాడా అంటే.. ఔననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. లాస్ట్ ఇయర్ వచ్చిన బింబిసార మూవీ.. నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతో మల్లిడి వశిష్ట డైరెక్టర్‌గా పరిచయం అయ్యాడు.
బ్లాక్ బస్టర్ మూవీ బింబిసార సీక్వెల్ నుంచి డైరెక్టర్ మల్లిడి వశిష్ట అవుట్ అయ్యాడా అంటే.. ఔననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. లాస్ట్ ఇయర్ వచ్చిన బింబిసార మూవీ.. నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతో మల్లిడి వశిష్ట డైరెక్టర్‌గా పరిచయం అయ్యాడు. ఫస్ట్ సినిమానే అయినా.. విజువల్స్ హ్యాండిల్ చేయడంలో సక్సెస్ అయ్యాడు వశిష్ట. దాంతో బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకున్నాడు. ఇదే స్పీడ్‌లో బింబిసార సీక్వెల్‌ను చేసేందుకు రెడీ అవుతున్నాడు. అయితే మధ్యలో రజనీకాంత్, రామ్ చరణ్‌తో సినిమాలు సెట్ చేసుకుంటున్నాడనే వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు ఏకంగా బింబిసార నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది. కళ్యాణ్ రామ్, మల్లిడి వశిష్ట మధ్య కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయని.. అందుకే ఎవరి దారి వారు చూసుకున్నారని ఇండస్ట్రీలో చెవులు కొరుక్కుంటున్నారు. అయితే కళ్యాణ్ రామ్, వశిష్ట ఓ అండర్‌స్టాండింగ్‌తోనే ఇలా చేశారని టాక్. మరి మల్లిడి వశిష్ట తప్పుకుంటే.. ఆయన స్థానంలోకి ఎవరొస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో బింబిసార 2తో అనిల్ పాడూరి అనే కొత్త డైరెక్టర్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నట్టు సమాచారం. ఈయన బింబిసార మూవీకి వీఎఫ్ఎక్స్ పనులు చూసుకున్నాడట. ప్రస్తుతం అనిల్ బింబిసార 2 పనుల్లో బిజీగా ఉన్నట్టు ఇండస్ట్రీలో భోగట్టా. మరోవైపు మల్లిడి వశిష్ట ఇతర బడా హీరోలతో సినిమా కోసం గట్టిగా ట్రై చేస్తున్నాడట. అయితే ఇలాంటి వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియదు గానీ.. బింబిసార సీక్వెల్ డైరెక్టర్ మ్యాటర్ మాత్రం హాట్ టాపిక్‌గా మారింది. అన్నట్టు బింబిసార2లో ఎన్టీఆర్ కూడా నటిస్తున్నట్టు టాక్ ఉంది. మరి ఇప్పుడు ఈ సీక్వెల్ పరిస్థితేంటో చూడాలి.