Salaar Trailer Release: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కొత్త మూవీ సలార్ (Salaar) విడుదల కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. ఒకసారి వాయిదా పడటంతో డిసప్పాయింట్ అయ్యారు. వచ్చేనెల 22వ తేదీన పక్కా రిలీజ్ చేస్తామని చెప్పడంతో కాస్త రిలాక్స్ అయ్యారు. సలార్ మూవీ రెండు పార్టులుగా రానుంది. ఫస్ట్ పార్ట్ ట్రైలర్ (Trailer Release) విడుదల చేసే తేదీని చిత్ర యూనిట్ ప్రకటించింది.
డిసెంబర్ 1వ తేదీన రాత్రి 7.19 గంటలకు ట్రైలర్ విడుదల చేస్తామని తెలిపింది. ఈ మేరకు ఓ పోస్టర్ విడుదల చేసింది. జీప్‌పై ప్రభాస్ గన్ ఫర్ చేస్తోన్న ఫోటో షేర్ చేసింది. దీంతో మూవీపై మరింత బజ్ ఏర్పడింది. మూవీని కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్నాడు. బాహుబలి తర్వాత ప్రభాస్‌కు హిట్లు లేవు. సాహో, రాధేశ్యామ్, ఆది పురుష్ సినిమాలు వరసగా నిరాశ పరిచాయి. సలార్ హిట్ కొడుతుందనే ధీమాలో ఫ్యాన్స్ ఉన్నారు.
???? ?? ??? ?? ????????? ???????????? ?#SalaarCeaseFire Trailer is set to detonate on Dec 1st at 7:19 PM ?
సలార్ తర్వాత వచ్చే ఏడాది సమ్మర్లో కల్కీ మూవీ రానుంది. తర్వాత మారుతి మూవీ ఉండనుంది. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ సినిమా చేస్తారు. ఇలా వరసగా సినిమాలు చేస్తున్నారు డార్లింగ్ ప్రభాస్.