Ram charan 15th movie titleగా గేమ్ ఛేంజర్, చెర్రీ బర్త్ డే సందర్భంగా రివీల్
Ram charan 15th movie title:గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 15వ సినిమా టైటిల్‌ను చిత్ర యూనిట్ రివీల్ చేసింది. ఈ రోజు చెర్రీ బర్త్ డే సందర్భంగా విడుదల చేసింది. మూవీ టైటిల్ గేమ్ ఛేంజర్ అని తెలిపింది. ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహిస్తుండగా.. రాజు, శిరీష్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
Ram charan 15th movie title:గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram charan) 15వ సినిమా టైటిల్‌ను చిత్ర యూనిట్ రివీల్ చేసింది. ఈ రోజు చెర్రీ (Ram charan) బర్త్ డే సందర్భంగా విడుదల చేసింది. మూవీ టైటిల్ గేమ్ ఛేంజర్ (Game changer) అని తెలిపింది. ఈ సినిమాకు శంకర్ (shankar) దర్శకత్వం వహిస్తుండగా.. దిల్ రాజుతో (dil raju) పాటు శిరీష్ (shireesh) కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
సినిమా టైటిల్‌కు సంబంధించి ఇప్పటికే చాలా పేర్లు వినిపించాయి. సర్కారోడు, సీఈవో, అధికారి, అప్పన్న అని రూమర్లు రాగా.. అవేవి కాకుండా గేమ్ ఛేంజర్ (Game changer) అనే పేరు పెట్టారు. ఈ మూవీ కూడా పాన్ ఇండియా కాగా.. అన్నీ భాషల్లో ఒక్కటే పేరు ఉండబోతుందని తెలిసింది. మోషన్ పోస్టర్ వీడియోలో థీమ్ (theme) మాత్రమే చూపించారు.
శాసన శాసన సభ వ్యవస్థను నిర్దేశించే ఎన్నికల అధికారి (election officer) పాత్రలో చరణ్ నటిస్తున్నారు. దానినే ఓపెన్ చేసి బ్యాక్ డ్రాప్ ఏంటనేది చెప్పారు. మూవీలో రామ్ చరణ్ (ram charan) లుక్‌ని ఈ రోజు మధ్యాహ్నాం విడుదల చేస్తారు. రిలీజ్ డేట్‌పై సస్పెన్స్ కొనసాగుతోంది.
ఆర్ఆర్ఆర్ మూవీలో నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు లభించడంతో చరణ్, తారక్ తర్వాత సినిమాల మీద ఆసక్తి పెరిగిపోయింది. అందుకు తగ్గట్టే శంకర్ గ్రాండ్ స్కేల్లో తెరకెక్కించారు. కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న మూవీకి తమన్ సంగీతం అందిస్తున్నారు.