ప్రస్తుతం ప్రభాస్ చేతిలో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. అలాగే ఈ సినిమాల మధ్యలో మారుతితో ఓ సినిమా చేస్తున్నాడని ఎప్పటి నుంచో వినిపిస్తునే ఉంది. ఇక అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో ‘స్పిరిట్’ అనే మూవీని ఎప్పుడో ప్రకటించాడు. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సినిమాలు అయిపోగానే స్పిరిట్ మొదలు కానుంది. వీటితో పాటు బాలీవుడ్ డైరెక్టర్ సిద్దార్ద్ ఆనంద్‌తో కూడా యాక్షన్ మూవీ చేయబోతున్నట్టు టాక్. ఇదిలా ఉండగానే.. ప్రభాస్ మరో ఊహకందని ప్రాజెక్ట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది.
గతంలో ప్రముఖ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీతో ఛాన్స్ వస్తే.. స్టొరీ కూడా వినకుండానే ఒకే చెప్పడానికి రెడీగా ఉన్నానని చెప్పాడు ప్రభాస్. ఓ రకంగా చెప్పాలంటే ప్రభాస్ డ్రీమ్ కూడా ఇదే. అయితే ఇప్పుడు నిజంగానే ఈ కాంబినేషన్ సెట్ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు. ఇప్పటి వరకు మున్నాభాయ్ ఎంబీబీఎస్, లగే రహో మున్నాభాయ్, త్రీ ఇడియట్స్, పీకే, సంజూ.. వంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు రాజ్ కుమార్ హిరానీ. ప్రస్తుతం షారుఖ్ ఖాన్‌తో ‘డుంకీ’ అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా తర్వాత ప్రభాస్‌తో ఓ సినిమా చేయబోతున్నాడట రాజ్ కుమార్. అంతేకాదు ఇప్పటికే ప్రభాస్ కోసం కథ కూడా రెడీ చేస్తున్నాడట. ఒకవేళ ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ అయితే మాత్రం.. పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ బక్సాఫీస్ షేక్ అయిపోవడం ఖాయమని చెప్పొచ్చు.