ప్రస్తుతం రాజకీయంగా ఫుల్ బిజీగా ఉన్నారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. అందుకే సినిమాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టలేకపోతున్నారు. పొలిటికల్ ఎంట్రీతో గ్యాప్ తీసుకొని ‘వకీల్ సాబ్’ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చారు పవన్. ఆ తర్వాత వరుస సినిమాలకు కమిట్ అయ్యారు. వాటిలో భీమ్లా నాయక్, పీరియాడిక్ ఫిల్మ్ ‘హరి హర వీరమల్లు’ను ఒకేసారి స్టార్ట్ చేశారు. అయితే భీమ్లా నాయక్ రిలీజ్ అయిపోయింది.. హిట్ కొట్టేసింది.. కానీ క్రిష్ డైరెక్ట్ చేస్తున్న ‘హరిహర వీరమల్లు’ మాత్రం పోస్ట్ పోన్ అవుతునే ఉంది. గత కొన్ని నెలలుగా అదిగో, ఇదిగో అనడమే తప్పా.. తిరిగి షూటింగ్ స్టార్ట్ చేయలేదు. దీనికి ఎన్నో కారణాలు వినిపించాయి.
పవన్ బస్ యాత్రకు రంగం సిద్దమవడంతో.. హరిహర వీరమల్లు మరింత ఆలస్యం ఖాయమనుకున్నారు. అయితే ఇప్పుడు బస్ యాత్రని పోస్ట్ పోన్ చేసిన పవన్.. మూడు నెలల్లో కమిట్ అయిన సినిమాలను కంప్లీట్ చేయాలని భావిస్తున్నారట. ముందుగా సగ భాగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న’హరి హర వీరమల్లు’ని పూర్తి చేయనున్నారట. ఇందుకోసం 50 రోజులు కేటాయించనున్నట్టు తెలుస్తోంది. కొత్త షెడ్యూల్‌ని దసరా తర్వాత అక్టోబర్ 16 నుండి మొదలెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారట. అలాగే ఈ గ్యాప్‌లో తమిళ్ హిట్ మూవీ ‘వినోదయ సీతం’ రీమేక్‌ను కూడా కంప్లీట్ చేసే ఆలోచనలో ఉన్నారట. అయితే హరీష్ శంకర్‌తో అనౌన్స్ చేసిన ‘భవదీయుడు భగత్ సింగ్’ పరిస్థితేంటి అనేది తెలియాల్సి ఉంది. మరి ఇలాంటి విషయాల్లో క్లారిటీ రావాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.