ప్రస్తుతం డీప్‌ఫేక్ అంశంపై సినీ ప్రముఖులతోపాటు పలువురు రాజకీయ నేతలు కూడా స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఇటివల రష్మిక మందన్నా ఫోటో మార్పింగ్ అంశంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ రియాక్ట్ అయ్యారు.
ప్రస్తుతం సినీ పరిశ్రమలో డీప్ ఫేక్(deepfake) వీడియో లేదా ఫోటో అంశంపై పలువురు ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నటీనటుల ఫోటోలు లేదా వీడియోలను మార్ఫింగ్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇటివల బ్రిటిష్ ఇన్ఫ్లుయెన్సర్ జారా పటేల్ వీడియో నటి రష్మిక మందన్నా ముఖంతో ఏఐ ఆధారంగా క్రియేట్ చేసిన వీడియో ఇటివల సోషల్ మీడియాలో చక్కర్లు కోట్టింది. అయితే ఈ వీడియోపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అంతేకాదు ఈ వీడియో ఘటనపై జారా కూడా స్పందించారు. రష్మిక ముఖంతో మార్ఫింగ్(morphing) చేసిన వీడియో విషయంలో తన ప్రమేయం లేదని స్పష్టం చేశారు. దీంతోపాటు ఈ ఘటనతో చాలా డిస్టబ్ అయ్యానని చెప్పారు. అంతేకాదు ఇలాంటి పరిస్థితులు భవిష్యత్తులో కొనసాగితే మహిళలు, అమ్మాయిల భవిష్యత్తు భయంకరంగా ఉంటుందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఈ ఘటనకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని అమితాబ్, నాగచైతన్య, మృణాల్ ఠాకూర్ సహా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని కోరారు.
అయితే ఇదే అంశంపై తెలంగాణ మంత్రి కేటీఆర్(KTR) కూడా స్పందించారు. రష్మిక మందన్నకు ఏమి జరిగిందో తాను వార్తల్లో చూశానని చెప్పారు. ఆమెను కించపరచడం, ఒక సెలబ్రిటీని అలా చేయడం నిజంగా దారుణమని అన్నారు. ఇది తీవ్ర అవమానకరమైన చర్య అని పేర్కొన్నారు. దీనిపై నిబంధనలు ఏమైనా తీసుకురావాలని, చట్టం రూపంలో ఎలాంటి కఠిన చర్యలు తీసుకున్నా దానిని తెలంగాణలో అమలు చేయడానికి తాము స్వాగతిస్తామన్నారు. అంతేకాదు భారత ప్రభుత్వం కూడా అదే పని చేస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఓ నేషనల్ మీడియా ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా వెల్లడించారు. మరోవైపు ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం కూడా రియాక్ట్ అయ్యింది. ఇలాంటి ఫోటోలు, వీడియోలు వచ్చిన 36 గంటల్లోపు వాటిని తొలగించాలని సోషల్ మీడియా కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది.
Union Government issues advisory to social media intermediaries to identify misinformation and deepfakes
– Remove any such content when reported within 36 hours of such reporting
నవంబర్ 6న రష్మిక మందన్నా(Rashmika Mandanna) తన డీప్‌ఫేక్ వీడియో గురించి తన మొదటి స్టేట్మెంట్ను పంచుకున్నారు. ఏఐ టెక్నాలజీని ఎలా దుర్వినియోగం చేస్తున్నారో సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ హాని కలిగిస్తున్నారని ఆమె తన ప్రకటనలో ప్రస్తావించారు. ఆమె ఇలా వ్రాసింది “దీనిని పంచుకోవడం నాకు చాలా బాధగా ఉంది. ఆన్లైన్లో వ్యాప్తి చెందుతున్న నా డీప్‌ఫేక్ వీడియో గురించి మాట్లాడవలసి వచ్చింది. ఇలాంటిది నిజాయితీగా, నాకే కాదు. ఈ రోజు హాని కలిగించే మనలో ప్రతి ఒక్కరికీ కూడా ఇది జరిగే అవకాశం ఉంది. సాంకేతికతను ఎలా దుర్వినియోగం చేస్తున్నారో చూడాలని ఆమె పేర్కొన్నారు.