పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ కల్కి 2898ఏడి పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా రిలీజ్ టైం దగ్గర పడుతుండడంతో.. షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో ఉంది చిత్ర యూనిట్. తాజాగా ఫైనల్ షెడ్యూల్ స్టార్ట్ అయినట్టుగా సమాచారం.
Kalki: కల్కి సినిమా పై రోజు రోజుకి నెక్స్ట్ లెవల్ హైప్ క్రియేట్ అవుతోంది. ఈ సినిమాలో ఇన్వాల్వ్ అయిన వారంతా.. అదో అద్భుతం అన్నట్టుగా చెబుతున్నారు. రీసెంట్గా స్టార్ రైటర్ సాయిమాధవ్ బుర్రా గురించి మాట్లాడుతూ.. ఇప్పటివరకూ తెలుగులో ఇలాంటి కథతో సినిమా రాలేదు.. ఇది పాన్ ఇండియా సినిమా కాదు.. పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ అని అన్నారు. ఇక నటకిరీటి రాజేంద్రప్రసాద్ కూడా ఇందులో ఓ కీలక పాత్ర పోషిస్తున్నానని లేటెస్ట్గా రివీల్ అయింది. ఇప్పటికే ఈ సినిమాలో.. అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్ నటిస్తున్నారు.
ఇక ఈ సినిమాను మే 9న ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 22 భాషల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని వినిపించింది. ఇప్పటి నుంచి చూస్తే.. సినిమా రిలీజ్‌కు మరో రెండు నెలల పైన ఓ వారం రోజులే ఉంది. అయినా కూడా ఇంకా ఈ సినిమా షూటింగ్ జరుతుతూ ఉందని అంటున్నారు. అసలు.. కల్కి షూటింగ్ కంప్లీట్ అయిందా? ఇప్పుడు షూట్ చేస్తుంది సెకండ్ పార్ట్ కోసమా? అనేది క్లారిటీ లేకుండా పోయింది.
లేటెస్ట్గా కల్కి ఫైనల్ షెడ్యూల్ స్టార్ట్ అయినట్టుగా తెలుస్తుంది. రీసెంట్‌గానే.. చిత్ర యూనిట్ కల్కి ఫైనల్ షెడ్యూల్ పూర్తి చేసే పనిలో ఉన్నారని అన్నారు. కానీ లేటెస్ట్ షెడ్యూల్ ఇటలీలో జరుగుతున్నట్టుగా సమాచారం. దీంతో ఈ సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అవుతుందని టాక్. ఆ తర్వాత టీజర్ రిలీజ్ చేసి ప్రమోషన్స్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు మేకర్స్. యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న కల్కి మూవీని, వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వని దత్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. మరి కల్కి ఎలా ఉంటుందో చూడాలి.