Jr.NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆస్కార్ వేడుకల కోసం అమెరికా వెళ్లినప్పుడు.. అన్న ఒక్కసారి మా ఏరియాకు రండి.. మేమేంటో చూపిస్తాం.. కార్లతో భారీ ర్యాలీ తీస్తాం.. అని ఎన్టీఆర్‌తో చెప్పారు అక్కడి అభిమానులు. దానికి తారక్ నవ్వుతూ.. అక్కడికొస్తే బతకనిస్తారా.. అంటూ నవ్వుతూ ఆన్సర్ చేశాడు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆస్కార్ వేడుకల కోసం అమెరికా వెళ్లినప్పుడు.. అన్న ఒక్కసారి మా ఏరియాకు రండి.. మేమేంటో చూపిస్తాం.. కార్లతో భారీ ర్యాలీ తీస్తాం.. అని ఎన్టీఆర్‌తో చెప్పారు అక్కడి అభిమానులు. దానికి తారక్ నవ్వుతూ.. అక్కడికొస్తే బతకనిస్తారా.. అంటూ నవ్వుతూ ఆన్సర్ చేశాడు. ఈ లెక్కన అమెరికాలో ఎన్టీఆర్ క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఫ్యాన్స్ అందు.. అమెరికా తారక్ ఫ్యాన్స్ వేరయా.. అనేలా తమ అభిమానాన్ని చాటుతునే ఉన్నారు వాళ్లు. ఆర్ఆర్ఆర్ రిలీజ్ సమయంలో భారీ ఎత్తున కార్లతో ర్యాలీ చేశారు. ఏకంగా ఎయిర్ ప్లేన్ బ్యానర్‌ని గాల్లో ఎగరేసారు. ‘తొక్కుకుంటూ పోవాలే’ అంటూ నానా హంగామా చేశారు. ఇలాంటివి చెప్పుకోవడానికి ఇంకా చాలా ఉన్నాయి ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు. అయితే ఎన్టీఆర్ 30 ముహూర్తం అలా ఫిక్స్ అయిందో లేదో.. అప్పుడే రచ్చ మొదలెట్టేశారు అమెరికన్ నందమూరి ఫ్యాన్స్. ఆకాశమే హద్దుగా.. ఏకంగా వరల్డ్ మూవీస్ టాప్ ప్లేస్ ‘హాలీవుడ్’లోనే ఎయిర్ ప్లేన్ బ్యానర్‌ని ఎగరేసారు. మార్చి 23న గ్రాండ్‌గా లాంచ్ చెయ్యనున్న ఎన్టీఆర్ 30కి ఆల్ ది బెస్ట్ చెప్పారు. కొరటాల, తారక్‌తో పాటు టీమ్ మొత్తానికి శుభాకాంక్షలు తెలిపారు. ‘Thankyou NTR.. Can’t Wait for NTR 30’ అంటూ ఎయిర్ ప్లేన్ బ్యానర్‌ని హాలీవుడ్ పై ఎగరేసారు. అంతేకాదు.. 2024 ఏప్రిల్ 5న హాలీవుడ్‌కి ఎరుపు రంగు వేద్దాం.. అంటూ ట్విట్టర్లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఇదంతా చూస్తుంటే.. జస్ట్ ఓపెనింగ్‌కే ఇలా ఉంటే.. రేపు టైటిల్, ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ వచ్చినప్పుడు.. ఏ రేంజ్లో హల్చల్ చేస్తారో ఊహించుకోవచ్చు. ముఖ్యంగా సినిమా రిలీజ్ సమయంలో మాత్రం.. తారక్ ఫ్యాన్స్‌ను తట్టుకోవడం కష్టమనే చెప్పాలి.