టాలీవుడ్ అప్ కమింగ్ మూవీస్‌లో.. రామ్, బోయపాటి నుంచి ఓ ఊరమాస్ సినిమా రాబోతోంది. ఈ కాంబినేషనే షాకింగ్ అంటే.. ఇప్పుడు రాబోతున్న అప్డేట్స్ మరింత షాక్ ఇచ్చేలా ఉన్నాయి. ఇప్పటి వరకు రామ్ చేసిన సినిమాల్లో.. ఇది అంతకుమించి అనేలా ఉండబోతోంది. తాజాగా ఈ సినిమా నుంచి సాలిడ్ లుక్ రిలీజ్ చేస్తూ.. ఫస్ట్ థండర్ టైం ఫిక్స్ చేశారు.
Ram:జగడం సినిమాలో రామ్‌ను (Ram) ఊరమాస్‌గా చూపించాడు సుకుమార్. కానీ అప్పటి లెక్కలు వేరు. రామ్ కటౌట్‌కు జగడం వర్కౌట్ కాలేదు. మళ్లీ ఇస్మార్ట్ శంకర్‌తో మాసివ్ హిట్ అందుకున్నాడు రామ్ పోతినేని (Ram). అదే జోష్‌లో రెండు సినిమాలు చేశాడు. అందులో రెడ్ మూవీ ఓటిటికే పరిమితం అవగా.. ది వారియర్ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేసింది. అందుకే ఇప్పుడు ఇస్మార్ట్ హీరోకి అర్జెంట్‌గా ఒక హిట్ కావాలి. అది కూడా ఊరమాస్ సబ్జెక్ట్ అయి ఉండాలి. అలాంటి హిట్ కావాలంటే.. బోయపాటి లాంటి మాస్ డైరెక్టర్ ఉండాల్సిందే.
బోయపాటితో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నాడు రామ్ (Ram). ఇంకా టైటిల్ ఫిక్స్ చేయని ఈ సినిమాను.. దసరా టార్గెట్‌గా రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. మే 15న రామ్ బర్త్ డే సందర్భంగా టీజర్ రిలీజ్ చేయ్యనున్నట్లు.. ఇటీవలె ప్రొడ్యూసర్ శ్రీనివాస్ చిట్టూరి అనౌన్స్ చేశాడు. తాజాగా ఈ ప్రాజెక్ట్ నుంచి మాసివ్ ట్రీట్‌ని కన్ఫామ్ చేశారు మేకర్స్.
రామ్ (Ram) నుంచి ఒక ఊహించని మాస్ అవతార్ పోస్టర్ని రిలీజ్ చేశారు. ఈ లుక్‌లో కాస్త చబ్బీగా కనిపిస్తున్నాడు రామ్. గతంలో ఈ సినిమాలో ఓ క్యారెక్టర్ కోసం.. రామ్ (Ram) వెయిట్ పెరుగుతున్నట్టు వార్తలొచ్చాయి. ఇప్పుడు దాన్ని నిజం చేస్తూ లేటెస్ట్ లుక్ రివీల్ చేశారు. ఇందులో క్యూట్‌గా ఉండే రామ్ (Ram), పూర్తిగా బోయపాటి హీరోలా మారిపోయి.. గడ్డం పెంచి ఊరమాస్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఈ లుక్ చూసి రామ్ (Ram) ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇక ఈ సినిమా ఫస్ట్ థండర్ మే 15న ఉదయం 11 గంటల 25 నిమిషాలకి రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. మరి రామ్ (Ram), బోయపాటి (Boyapati) ఈ సినిమాతో ఎలాంటి హిట్ అందుకుంటారో చూడాలి.