టాలీవుడ్ ఫిల్మ్ ఫెడరేషన్ అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో 24 క్రాఫ్ట్స్ యూనియన్ల నేతలు పాల్గొన్నారు. గత కొంతకాలంగా వేతనాలు పెంచాలని సినీ కార్మికులు సమ్మె చేస్తున్న నేపథ్యంలో.. భవిష్యత్తు కార్యాచరణపై ఈ భేటీలో అంతర్గత చర్చలు జరుపుతున్నారు. కాగా, ఇప్పటికే చిరంజీవితో ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు సమావేశమై వారి సమస్యలను వినిపించారు.