అక్కినేని నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల పెళ్లి డిసెంబర్ 4న జరగనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వీరి వివాహానికి ఆహ్వానితుల జాబితా సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ పెళ్లికి దగ్గుబాటి, మెగా, మహేష్ బాబు కుటుంబాలకు ప్రత్యేక ఆహ్వానం అందించనున్నారట. రాజమౌళితో పాటు పలువురు దర్శకులు, నిర్మాతలు, నటీనటులను ఆహ్వానించేందుకు సిద్ధం అవుతున్నారట. బాలీవుడ్ నుంచి అమితాబ్ బచ్చన్, రణ్బీర్ ఫ్యామిలీ, ఇతర కుటుంబాలను ఆహ్వానిస్తున్నట్లు సమాచారం.