ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ త్రివిక్రమ్ తమ 4వ చిత్రం కోసం మళ్లీ కలిశారు. ఈ మూవీ సెమీ ఫాంటసీ(socio fantasy) చిత్రంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.
అల్లు అర్జున్, త్రివిక్రమ్(banni trivikram) క్రేజీ కాంబినేషన్ కి ఎలాంటి క్రేజ్ ఉందో చెప్పక్కర్లేదు. కాగా ఈ జోడి మరోసారి రిపీట్ అవుతోంది. అది కూడా వీరి కాంబినేషన్ లో సోషియో ఫాంటసీ మూవీతో రానున్నారు. అల్లు అర్జున్, త్రివిక్రమ్ గతంలో జులాయి, S/O సత్యమూర్తి, అలా వైకుంఠపురములో వంటి హిట్ చిత్రాలతో వచ్చారు. కాబట్టి రాబోయే ప్రాజెక్ట్‌పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.
ఇప్పుడు అల్లు అర్జున్, త్రివిక్రమ్ సోషియో ఫాంటసీ(socio fantasy) ఎంటర్టైనర్ను ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్లో సోషియో ఫాంటసీలు చాలా అరుదు కాబట్టి ఇది అందరినీ థ్రిల్ చేస్తోంది. ప్రస్తుతం గుంటూరు కారం అనే మాస్ ఎంటర్టైనర్లో మహేష్ బాబును డైరెక్ట్ చేస్తున్న త్రివిక్రమ్ అల్లు అర్జున్‌ని పూర్తిగా డిఫరెంట్‌గా చూపించే ఆలోచనలో ఉన్నాడు. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్పా ది రైజ్ చిత్రానికి సీక్వెల్ అయిన పుష్ప ది రూల్ చిత్రంలో నటిస్తున్నాడు. తర్వాత సందీప్ వంగా దర్శకత్వంలో కూడా నటించనున్నాడు. అల్లు అర్జున్ పుష్ప ది రూల్‌పై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇది పుష ది రైజ్‌కి సీక్వెల్. ఇది దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.