AAP MP Raghav Chadha Engagement Parineeti Chopra on May 13th
Raghav Chadha-Parineeti Chopra:ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా(Raghav Chadha)-నటి పరిణితి చోప్రా (Parineeti Chopra) మరోసారి మీడియా కంట పడ్డారు. వీరిద్దరూ కలిసి తిరగడంతో పెళ్లి ఒక్కటే చర్చ జరిగింది. అక్టోబర్ నెలలో వీరి మ్యారెజ్ ఉంటుందని తెలుస్తోంది. ఇంతలో మరోసారి డిన్నర్ డేట్‌కు వెళ్లారు. సెలబ్రిటీ కపుల్ కనిపించగానే.. మీడియా ప్రతినిధులు క్లిక్ అనిపించారు. ఆ ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ముంబైలో ఆదివారం రాత్రి ఇద్దరు డిన్నర్ డేట్‌కు వచ్చారు. వీరిని చూసిన వీడియో ప్రతినిధులు ఫోటోలు తీసి.. పెళ్లి గురించి మరోసారి అడిగారు. సమాధానం చెప్పకుండా అక్కడినుంచి వెళ్లిపోయారు. ఇప్పుడే కాదు చాలా సార్లు ఇద్దరు కలిసి డిన్నర్ డేట్, లంచ్ మీటింగ్స్‌కు వెళ్లారు. ముంబైలో జరిగిన కార్యక్రమాలకు జంటగా హాజరయ్యారు.
కలిసి తిరగడంతో ప్రేమ, పెళ్లి గురించి చర్చ జరిగింది. దాంతో అక్టోబర్‌లో పెళ్లి ఉంటుందని రాఘవ్-పరిణీతి సన్నిహితుల ద్వారా తెలిసింది. ఈ నెల 13వ తేదీన ఢిల్లీలో నిశ్చితార్థం వేడుక జరగనుందని తెలిసింది. ఎంగెజ్మెంట్కు ముందు నిర్వహించే రోకా వేడుక పూర్తయ్యిన సంగతి తెలిసిందే.
13వ తేదీన రాఘవ్- పరిణితి నిశ్చితార్థం ఖాయం అని తెలుస్తోంది. అందుకోసమే పరిణీతి చోప్రా (Parineeti Chopra) షూటింగ్స్ వాయిదా వేసుకుందని తెలుస్తోంది. పరిణీతి (Parineeti) ప్రస్తుతం హిందీలో చమ్కీలా, క్యాప్స్యుల్ గిల్ సినిమాల్లో నటిస్తున్నారు. రాఘవ్ చద్దా (Raghav Chadha) ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తోన్న సంగతి తెలిసిందే. వీరి పెళ్లి గురించి రాజ్యసభలో కూడా చర్చకు వచ్చింది.