మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ ‘లక్కీ భాస్కర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం అందుకున్నారు. ఈ నేపథ్యంలో రెండు డైరెక్ట్ తెలుగు సినిమాలకు ఆయన ఒకే చెప్పారట. ఇందులో మొదటి సినిమాను ఈ నెల చివరి నాటికి ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. అనంతరం ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్తారట. ఇక ఈ చిత్రాన్ని తెలుగు స్టార్ డైరెక్టర్ ఒకరు తెరకెక్కిస్తారని, భారీ బడ్జెట్ సినిమాగా ఇది రాబోతున్నట్లు సినీ వర్గాల్లో టాక్.