తెలుగు ప్రజలపై ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీనటి కస్తూరి ఆచూకీ లభించలేదని పోలీసులు ప్రకటించారు. అయితే హిందూ మక్కల్ కట్చి ఆధ్వర్యంలో చెన్నైలో నిర్వహించిన ఆందోళనలో పాల్గొన్న ఆమె.. తెలుగువారిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై పలు తెలుగు సంఘాలు ఆమెపై కేసు పెట్టారు. ఈ నేపథ్యంలో పరారీలో ఉండటంతో.. ఆమెను గాలించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.