దీపావళి పండగ పురస్కరించుకుని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు రష్మికా మందన్న స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోను బన్నీ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో ఈ ‘ఎవరికైనా వెండి బహుమతిగా ఇస్తే వాళ్లకు అదృష్టం కలిసి వస్తోందని మా అమ్మ చెప్పింది. ఈ చిన్న వెండి వస్తువు, స్వీట్స్.. మీకు మరింత అదృష్టం తీసుకొస్తుందని అనుకుంటున్నా. హ్యాపీ దీపావళి’ అంటూ రష్మిక రాసుకొచ్చారు. దీనికి బన్నీ థ్యాంక్స్ చెప్పారు.