ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది. నవంబర్ 28 ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ పోస్టర్ షేర్ చేశారు. ఇక మహేష్ బాబు పి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే, కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు.