ప్రస్తుతం చాలామందికి ఎక్కువగా జుట్టు రాలిపోవడం జరుగుతుంది. జీవనశైలిలో మార్పులు, కాలుష్యం కారణంగా ఎక్కువమందికి జుట్టు రాలిపోతుంది. ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే కొన్ని చిట్కాలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. మరి అవెంటో ఇక్కడ తెలుసుకుందాం.
Hair Care: ఈరోజుల్లో చాలామందిని వేధిస్తున్న సమస్య జుట్టు రాలిపోవడం. ఈ సమస్య నుంచి విముక్తి పొందాలని కొంతమంది కురుల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ జుట్టు రాలిపోతూనే ఉంటుంది. మరి కురులు రాలిపోయే సమస్యకు చెక్ పెట్టాలంటే కొన్ని టిప్స్ పాటించాలి. అందులోనూ దువ్వెన విషయంలో అయితే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. కురులను దువ్వడానికి ఎక్కువగా ప్లాస్టిక్ దువ్వెనలను వాడుతుంటారు. వీటిని కాకుండా చెక్క దువ్వెనను వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. చెక్క దువ్వెనను వాడటం వల్ల స్కాల్ప్‌కు మసాజ్‌లా పనిచేస్తుందని అంటున్నారు. దీంతో రక్తప్రసరణ జరిగి జుట్టు ఆరోగ్యంగా ఉండటంతో పాటు బలంగా పెరుగుతుందని చెబుతున్నారు.
అయితే వేప చెక్కతో తయారు చేసిన దువ్వెన వాడటం బెటర్ అని అంటున్నారు. వేప కారణంగా చుండ్రు సమస్యలు తగ్గి, జుట్టు కుదుళ్లు బలంగా తయారవుతాయి. వీటి వల్ల తొందరగా జుట్టు పెరుగుతుంది. వీటితో పాటు దురద, పేలు, ఇన్ఫెక్షన్ వంటివి దరిచేరవు. జుట్టు రాలిపోకుండా ఉండాలంటే కేవలం దువ్వెనను మారిస్తే సరిపోదు. ఆరోగ్య అలవాట్లు కూడా మార్చాలి. ఐరన్, కాల్షియం వంటివి ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. ఎక్కువ సార్లు తలస్నానం చేయకూడదు. అలా అని వారానికొకసారి కాకుండా రెండుసార్లు తలస్నానం చేయడం మేలు. వారినికొకసారైన తలకి మసాజ్ చేస్తూ నూనె రాయాలి. సహజసిద్ధమైన షాంపూలు వాడుతుండాలి. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే జుట్టు ఆరోగ్యంగా ఉండటంతో పాటు బలంగా ఉంటుంది.