»Womens Premier League Auction 2023 Live Smriti Mandhana To Rcb For 3 4cr
Smriti Mandhana To RCB For 3.4Cr : మహిళల ఐపీఎల్: రికార్డు ధర పలికిన స్మృతి మంధాన…!
Smriti Mandhana To RCB For 3.4Cr : మహిళల ఐపీఎల్: రికార్డు ధర పలికిన స్మృతి మంధాన...! : మహిళల ఐపీఎల్ కి రంగం సిద్ధమైంది. దీనిలో భాగంగా ముంబయిలో ఐపీఎల్ వేలం ప్రారంభించారు. కాగా... ఈ వేలంలో స్మృతి మందాన రికార్డు ధర పలకడం విశేషం. 3 కోట్ల 40 లక్షల రూపాయలకు రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూర్ ఫ్రాంచైజీ ఆమెను దక్కించుకుంది. మరోవైపు భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ను ముంబై ఇండియన్స్ జట్టు కోటి 80 లక్షలకు దక్కించుకుంది.
మహిళల ఐపీఎల్ కి రంగం సిద్ధమైంది. దీనిలో భాగంగా ముంబయిలో ఐపీఎల్ వేలం ప్రారంభించారు. కాగా… ఈ వేలంలో స్మృతి మందాన రికార్డు ధర పలకడం విశేషం. 3 కోట్ల 40 లక్షల రూపాయలకు రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూర్ ఫ్రాంచైజీ ఆమెను దక్కించుకుంది. మరోవైపు భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ను ముంబై ఇండియన్స్ జట్టు కోటి 80 లక్షలకు దక్కించుకుంది.
ఇంగ్లండ్ ఆల్ రౌండర్ సోఫీ ఎక్లెస్టోన్ కోసం పోటీ నెలకొంది. ఢిల్లీ క్యాపిటల్స్, యూవీ వారియర్స్ పోటీ పడ్డాయి. చివరికి యూపీ వారియర్స్ పై చేయి సాధించింది. 1.80 కోట్లకు సోఫీ ఎక్లెస్టోన్ ను దక్కించుకుంది. మరోవైపు ఆస్ట్రేలియా ప్లేయర్ ఎలిస్ పెర్రీని రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూర్ 1.70 కోట్లకు దక్కించుకుంది.
ఆసీస్ ప్లేయర్ ఆస్లీ గార్డినర్ భారీ మొత్తం దక్కించుకుంది. ముంబై, యూపీ ఫ్రాంచైజీలు ఆమె కోసం పోటీ పడ్డాయి. చివరకు గుజరాత్ ఎంట్రీ ఇచ్చి ఆమెకు గాలం వేసింది. 3.20 కోట్లకు ఆస్లీ గార్డినర్ ను సొంతం చేసుకుంది. కివీస్ క్రికెటర్ సోపీ డివైన్ బెంగళూర్ చెంతకు చేరింది. రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూర్ ఫ్రాంచైజీ ఆమెను కనీస ధర 50 లక్షలకు కొనుగోలు చేసింది.