Landslide : భారీ వర్షాల కారణంగా ఇథియోపియాలోని మారుమూల ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి 146 మంది మరణించారు. దక్షిణ ఇథియోపియాలోని కెంచో షాచా గోజ్డి జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఎక్కువ మంది చిన్న పిల్లలు, గర్భిణీ స్త్రీలు ఉన్నారని స్థానికులు తెలిపారు. మృతుల్లో 50 మంది మహిళలు ఉన్నారు. గోఫా ప్రాంతంలోని మారుమూల కొండ ప్రాంతంలో భారీ వర్షాల తర్వాత ఆదివారం సాయంత్రం.. సోమవారం ఉదయం రెండు సంఘటనలు సంభవించాయని చెప్పారు. ప్రాణాలతో బయటపడిన వారి కోసం అన్వేషణ తీవ్రంగా కొనసాగుతోంది. అయితే “మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది” అని స్థానిక అధికారులు తెలిపారు.
ప్రమాదం తర్వాత, వందలాది మంది ప్రజలు సంఘటన స్థలంలో గుమిగూడారు. ఇతరులు క్రింద చిక్కుకున్న వ్యక్తుల కోసం వెతకడానికి మట్టిని తవ్వడం కనిపించింది. విడుదలైన వీడియోలలో ఒక కొండ పాక్షికంగా కూలిపోవడం. పెద్ద ఎర్రటి మట్టి దిబ్బగా కనిపిస్తోంది. మృతుల్లో మహిళలు, పిల్లలు, పోలీసు అధికారులు కూడా ఉన్నారని గోఫా రీజియన్ జనరల్ అడ్మినిస్ట్రేటర్ మెస్కిర్ మిట్కు తెలిపారు. ఆదివారం రాత్రి భారీ వర్షాలు కురిశాయి. కొండచరియలు విరిగిపడటంతో కొంతమంది మరణించారని గోఫా జిల్లా ప్రభుత్వ ప్రతినిధి కస్సాహున్ అబయ్నే చెప్పారు.
గోఫా రాజధాని అడిస్ అబాబాకు నైరుతి దిశలో 320 కిమీ (199 మైళ్ళు) దూరంలో ఉన్న దక్షిణ ఇథియోపియాలోని భాగం. దేశంలోని దక్షిణ ఇథియోపియా ఇటీవలి నెలల్లో భారీ వర్షాలు, వరదల వల్ల తీవ్రంగా ప్రభావితమైంది. అయితే కొండచరియలు విరిగిపడటం, వరదలు ఇటీవల భారీగా పెరిగాయి. మే 2016లో దేశంలోని దక్షిణ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా వరదలు, కొండచరియలు విరిగిపడటంతో కనీసం 50 మంది మరణించారు. అయితే వాతావరణ మార్పుల కారణంగా అధిక వర్షపాతం నమోదవుతుంది. ఈ ఏడాది మేలో వరదల కారణంగా అనేక ప్రాంతాల్లో 19,000 మందికి పైగా ప్రజలు నష్టపోయారు. వెయ్యి మందికి పైగా నిరాశ్రయులయ్యారు. 2018 సంవత్సరంలో దక్షిణ ప్రాంతంలో ఒక వారం వ్యవధిలో రెండు వేర్వేరు కొండచరియలు విరిగిపడటంతో కనీసం 32 మంది మరణించారు.