»America Shocked Indian Students Cellphones And Laptops Are Seized
America: భారత విద్యార్థులకు షాకిచ్చిన అమెరికా..సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు సీజ్
అమెరికాకు వెళ్లిన భారత విద్యార్థులకు చేదు అనుభవం ఎదురవుతోంది. చాలా మందిని ఇమిగ్రేషన్ చెక్ పేరుతో ఇబ్బంది పెట్టారు. మరికొందరిని సరైన పత్రాలు లేవంటూ వెనక్కి పంపేస్తున్నారు.
భారతీయ విద్యార్థులకు అమెరికా (America) షాక్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల నుంచి అమెరికా వెళ్లివారిని గట్టి దెబ్బే తగిలింది. ఎన్నో ఆశలతో అక్కడికి వెళ్లిన వారిని ఇమిగ్రేషన్ చెక్(Immigration Check)లో డిపోర్ట్ (Deport) చేస్తూ ఇబ్బంది పెట్టారు. సరైన పత్రాలు లేవని మరికొందరిని వెనక్కి పంపుతున్నారు. ఒక్క రోజులోనే 21 మంది భారత విద్యార్థుల్ని అమెరికా వెనక్కి పంపింది. నిరాశతో వాళ్లంతా తిరిగి ఢిల్లీ(Delhi)కి రిటర్న్ అయ్యారు. వీసా (Visa) ప్రాసెస్ పూర్తయ్యి, యూనివర్సిటీ నుంచి అడ్మిషన్ కూడా వచ్చాక ఇలాంటి అనుభవం ఎదురవడంతో వారంతా దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
తమకు సరైన కారణాలు చెప్పకుండా డిపోర్ట్(Deport) చేశారని మరికొందరు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. చాలా మంది విద్యార్థుల్ని ఇమిగ్రేషన్ చెకింగ్ పేరుతో ఇరుకు గదుల్లో పెట్టి నిర్బంధించినట్లు బాధితులు తెలిపారు. వాదించిన వారికి జైలు శిక్ష పడుతుందని భయపెట్టినట్లు తెలిపారు. దాదాపుగా 16 గంటల పాటు పేరెంట్స్‌తో సైతం మాట్లాడనివ్వలేదు. విద్యార్థుల సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు సీజ్ చేసినట్లు విద్యార్థులు బాధను వ్యక్తం చేశారు.
అమెరికా (America) వెళ్లి చదువుకోవాలని చాలా మంది కల. అయితే ఆ దేశానికి వెళ్లేందుకు వీసా నిబంధనలు కఠినంగా కూడా ఉంటాయి. ఒకసారి డిపోర్ట్ చేసినట్లైతే 5 ఏళ్లపాటు అమెరికాలో అడుగుపెట్టే అవకాశం లేదు. అమెరికాలో ఉన్నత చదువులు చదవడం కోసం చాలా మంది లక్షల్లో అప్పులు చేసి వెళ్తుంటారు. తీరా అక్కడికి వెళ్లాక ఇలాంటి పరిస్థితి నెలకొనడంతో వారంతా దుఃఖంలో మునిగిపోయారు. అట్లాంటా, శాన్ఫ్రాన్సిస్కో, చికాగోతో ఇంకొన్ని ప్రాంతాల్లో ల్యాండ్ అయిన భారత విద్యార్థులకు ఈ పరిస్థితి ఎదురవడంతో చాలా మంది రిటర్న్ ఫ్లైట్‌లోనే ఢిల్లీకి వచ్చేశారు.