Stop Drinking Tea Coffee Benefits : టీ, కాఫీలు ఎక్కువగా అలవాటు ఉన్న వారు సడెన్గా వాటిని మానేస్తే చాలా ఇబ్బందిగానే ఉంటుంది. అయితే ఒక్క నెల రోజుల పాటు వీటిని పూర్తిగా మానేసి చూడండి. నిజంగానే మీ ఆరోగ్యం విషయంలో అద్భుతాలు జరుగుతాయి. ఇంతకీ వీటిని తాగకపోవడం వల్ల కలిగే లాభాలేంటో(benefits) ఇప్పుడు తెలుసుకుందాం. వచ్చేయండి.
సాధారణంగా టీలు, కాఫీల్లో చక్కెర ఎక్కువగా వేసుకుని తాగుతూ ఉంటారు. అందుకనే వీటిని మానేయడం వల్ల షుగర్ లెవెల్స్ అదుపులోకి వస్తాయి. మరీ ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ పని చేయడం వల్ల ఎంతో లాభం చేకూరుతుంది. అలాగే హైబీపీతో ఇబ్బంది పడే వారికి కూడా వీటిని తాగకుండా ఉండటం వల్ల లాభం కలుగుతుంది. ఇవి రక్తపోటును పెంచే పదార్థాలని కొన్ని అధ్యయనాల్లో వెల్లడైంది.
ఈ రోజుల్లో చాలా మందికి నిద్ర సమస్యగా ఉంటోంది. పడుకుందామని ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టదు. అలాంటి ఇబ్బందులు ఉన్న వారు టీ, కాఫీలు(Tea, coffee) మానేసి చూడండి. నిద్ర మంచిగా పడుతుంది. వీటి ద్వారా అధికంగా లోపలికి వెళ్లే చక్కెర వల్ల బరువు పెరిగే ప్రమాదమూ ఉంటుంది. అదే ఇవి మానేస్తే బరువు తగ్గే ఆస్కారం ఉంటుంది. వీటిని ఎక్కువగా తాగే వారిలో దంత సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. వీటిలో ఆమ్ల స్వభావం ఎక్కువగా ఉండటం వల్ల పళ్లు రంగు మారతాయి. అదే టీలు తాగడం మానేస్తే ఈ సమస్యలన్నీ దరిచేరకుండా ఉంటాయి.