లోకేష్ కనగరాజ్ మూవీలో తలైవా రజనీకాంత్‌కు పోటీగా నటించే విలన్ దొరికేశాడు. విలన్ రోల్ కోసం యాక్షన్ హీరో అర్జున్‌ను ఎంపిక చేశారట.
తెలుగు అమ్మాయిలకు ఓపిక తక్కువ అని.. హీరోయిన్ అవకాశం ఇస్తామని చెబితే ఆరు నెలలు కూడా వెయిట్ చేయలేరని డైరెక్టర్ తేజ అన్నారు.
హీరో, హీరోయిన్లు వాడే డ్రెస్సులు, వాచీలు, గ్యాడ్జెట్స్ రేట్స్ ఓ రేంజ్‌లో ఉంటాయి. ఏదైనా సరే లక్షలు, కోట్ల కాస్ట్‌ది అయి ఉండాల్సిందే. అందుకే ఎలాంటి ఫోటో షూట్ అయినా, ఈవెంట్ అయినా.. ఫలానా హీరో ఏం ధరించాడు, ఫలానా హీరోయిన్ డ్రెస్ ఎలా ఉంది? వాటి కాస్ట్ ఎంత అని సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ చేస్తున్నారు. తాజాగా సమంత గౌను రేటు షాక్ ఇస్తోంది.
రౌడీ హీరో విజయ్ దేవరకొండ-సమంత కలిసి ఖుషి మూవీలో నటిస్తున్నారు. షూటింగ్ టర్కీలో జరుగుతుండగా.. షూట్ గ్యాప్‌లో ఇద్దరు లంచ్, డిన్నర్ కోసం బయటకు వెళుతున్నారు.
మళయాళి క్యూట్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్‌కు యూత్‌లో యమా క్రేజ్ ఉంది. తక్కువ కాలంలో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ జనరేషన్ యూత్‌లో అనుపమా డీపి లేని మొబైల్ ఫోన్ ఉండదేమో. కుర్రాళ్ల కలల రాకుమారి అనుపమా. అలాంటి ఈ బ్యూటీ సీక్రెట్‌గా ఎంగేజ్మెంట్ చేసుకుందనే న్యూస్ వైరల్‌గా మారింది. అసలు మ్యాటర్ వేరే అని తెలియడంతో.. ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.
టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి డేటింగ్లో ఉన్నారని ఇటీవల పుకార్లు వచ్చాయి. ఈ క్రమంలో విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ జంట జూన్ 9న నిశ్చితార్థం చేసుకోవాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. సన్నిహిత వర్గాల మధ్య నిశ్చితార్థ వేడుకకు జరగనుందని సమాచారం. అయితే ఇది వారి ఇళ్లలో లేదా హైదరాబాద్‌లోని ఒక ప్రదేశంలో జరుగుతుందని తెలుస్తోంది. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇద్దరూ ప్రస్తుతం దే...
ప్రస్తుతం ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా నాలుగు సినిమాలను బ్యాక్ టు బ్యాక్ ఆడియెన్స్ ముందుకు తీసుకురాబోతున్నాడు పవర్ స్టార్. ఎన్నడూ లేని విధంగా పవన్ స్పీడ్ చూసి పండగ చేసుకుంటున్నారు అభిమానులు. ముఖ్యంగా ఓజి ఓవర్ స్పీడ్‌లో దూసుకుపోతోంది. పవన్ చేస్తున్న సినిమాల్లో ఈ సినిమా షూటింగ్‌నే టాప్ ప్లేస్‌లో ఉంది. దీనికి కారణం పవన్ భారీ రెమ్యూనరేషన్ అని తెలుస్తోంది.
నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బడ్జెట్‌తో ఫాంటసీ డ్రామాగా తెరకెక్కింది బింబిసార మూవీ. దాదాపు 40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర 65 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి.. కళ్యాణ్ రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. అప్పటి నుంచి బింబిసార 2 కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. కానీ ఈ మధ్యలో సైలెంట్ అయిపోయింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ సో...
టాలీవుడ్ సినీ జర్నలిస్టుల్లో సురేష్ కొండేటి పేరు.. ఈ మధ్య తెగ వైరల్ అవుతోంది. హీరోయిన్ పుట్టు మచ్చల గురించి అడిగినప్పటి నుంచి కొండేటి ఏది అడిగినా వైరల్ అవుతునే ఉంది. దీంతో డైరెక్టర్స్‌కు సురేష్ కొండేటి కాంట్రవర్శీ క్వశ్చన్స్ వేస్తూ.. ట్రెండింగ్‌లో ఉంటున్నాడు. కానీ రీసెంట్‌గా హరీష్ శంకర్, తేజ కొండేటిని ఆడుకున్నారు. తేజ అయితే భయపెట్టినంత పని చేశాడు. అందుకే ఈయన సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు.
పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నాలుగు సినిమాలు చేస్తున్నారు. బ్రో, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజి, హరిహర వీరమల్లు చేస్తున్నారు. వీటిలో హరిహర వీరమల్లుని పక్కకు పెట్టేసి.. మిగతా సినిమాలను పరుగులు పెట్టిస్తున్నాడు పవర్ స్టార్. అయితే ఓజి మాత్రం జెట్ స్పీడ్‌తో దూసుకుపోతోంది. కానీ ఈ సినిమాలో ఓ బ్యూటీని వద్దంటే వద్దంటున్నారు పవన్ ఫ్యాన్స్.
టాలీవుడ్ హీరోలు.. కేవలం హీరోలుగా మాత్రమే కాదు బిజినెస్ పరంగాను దూసుకుపోతున్నారు. దేశ విదేశాల్లో భారీ పెట్టుబడులు పెడుతున్నారు. అలాగే కమర్షియల్‌గా రెండో చేత్తో గట్టిగానే వెనకేసుకుంటున్నారు. అల్లు అర్జున్ కూడా రేసుగుర్రంలా పాన్ ఇండియా రేంజ్‌లో సత్తా చాటుతున్నాడు. ఇక ఇప్పుడు మల్టీప్లెక్స్ నిర్మాణంలోను అడుగు పెట్టాడు. ఆ మల్టీ ప్లెక్స్‌ను ప్రభాస్ కొత్త సినిమాతో లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
'చిత్రం' సినిమాతో మెగా ఫోన్ పట్టిన సినిమాటో గ్రాఫర్ 'తేజ'.. జయం, నువ్వునేను వంటి సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చాడు. ఈ సినిమాలతో ఎంతో మంది టాలెంటెడ్ యాక్టర్స్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఇక ఇప్పుడు దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి మరో కొత్త హీరోని లాంచ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' పై తేజ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
హాలీవుడ్ నటుడు 83 ఏళ్ల ఆల్ పాసినో తన 29 ఏళ్ల ప్రేయసి నూర్ అల్ఫాల్లాతో డేటింగ్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఆమె ప్రెగ్నెంట్ కావడంతో త్వరలోనే వీరు తల్లిదండ్రులు కానున్నారు.
విక్టరీ వెంకటేష్‌తో చేసిన 'నారప్ప' సినిమా తర్వాత మరో కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు టాలెంటెడ్ డైరెక్టర్స్ శ్రీకాంత్ అడ్డాల. అయితే ఇప్పుడు ఓ కొత్త బాధ్యతను తన భుజాన వేసుకున్నాడు. మరో కొత్త హీరోని లాంచ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.
టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఆయనను ఫ్యాన్స్ అభిమానులుగా కంటే భక్తులుగా చెప్పుకోవడానికి ఇష్టపడతారు. ఆయనను ఓ దేవుడిలా పిలుస్తుంటారు. ఆయన నిజంగా తన కొత్త సినిమాలో దేవుడిగా కనిపించనున్నాడు.