ప్రస్తుతం ప్రభాస్‌తో సలార్ మూవీని తెరకెక్కిస్తున్నాడు టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్. వచ్చే ఏడాది సెప్టెంబర్ 28న ఈ సినిమా రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా రిలీజ్ అవకముందే.. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో ఓ సినిమాకు కమిట్ అయ్యాడు ప్రశాంత్ నీల్. కొరటాల ప్రాజెక్ట్ అయిపోగానే ఎన్టీఆర్‌తో సినిమా మొదలు పెట్టాలని చూస్తున్నాడు. అయితే ఇప్పుడు ఊహించని విధంగా కెజియఫ్ 3 లైన్లోకి వచ్చేసినట్టు తెలుస్తోంది. కెజియఫ్2 క్లైమాక్స్‌లో కెజియఫ్3 ఉంటుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. దాంతో ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా.. అని ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు మూవీ లవర్స్. ఈ నేపథ్యంలో.. కెజియఫ్, సలార్ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చింది. ‘రాబోయే ఐదేళ్లలో పలు సినిమాల కోసం 3వేల కోట్ల పెట్టుబడి పెట్టబోతున్నామని.. సంవత్సరానికి కనీసం ఐదారు చిత్రాలు తమ బ్యానర్ నుంచి వస్తాయని.. హోంబలే అధినేత విజయ్ కిరంగదూర్ చెప్పారు. అలాగే ‘సలార్’ పూర్తయ్యాక ‘కేజీయఫ్-3’పై ప్రశాంత్ నీల్ దృష్టి పెట్టనున్నారని చెప్పుకొచ్చారు. ఇప్పటికే అతని వద్ద స్టోరీ లైన్ రెడీ ఉందని.. సలార్ కంప్లీట్ అవగానే కేజీయఫ్-3 స్క్రిప్ట్ పనులు మొదలు పెట్టనున్నారని తెలిపారు. వచ్చే ఏడాదిలో లేదా.. 2024లో కెజియఫ్ 3 స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నారు. దాంతో కెజయఫ్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. అయితే ఎన్టీఆర్ 31 తర్వాతే చాప్టర్ 3 ఉండే అవకాశాలున్నాయి. ఈ విషయంలో క్లారిటీ రావాలంటే.. సలార్ రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే.