‘అఖిల్’ సినిమాతో ఫస్ట్ అటెంప్ట్‌తో మాస్ ఫాలోయింగ్ పెంచుకోవాలని చూశాడు అక్కినేని అఖిల్. అయితే ఇప్పటి వరకు అఖిల్‌కు మాస్ హిట్ పడలేదు. కానీ సాఫ్ట్‌గా, లవర్ బాయ్‌గా మెప్పించాడు. అయితే ఈసారి మాత్రం మాసివ్ హిట్ అందుకోవాలనే కసితో ఉన్నాడు. అందుకే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్నాడు. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కూడా సైరా నరసింహారెడ్డి తర్వాత కమర్షియల్ హిట్ కోసం ట్రై చేస్తున్నాడు. అందుకే ఈ ఇద్దరు కలిసి స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా ఏజెంట్ అనే సినిమా చేస్తున్నారు. అయితే చాలా కాలంగా పోస్ట్ పోన్ అవుతోంది ఏజెంట్. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. వాస్తవానికి సంక్రాంతి బరిలో ఏజెంట్ ఉండడం పక్కా అనుకున్నారు. కానీ మరింత వెనక్కి వెళ్లాడు ఏజెంట్. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. 2023 ఫిబ్రవరిలో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే డేట్ లాక్ చేశారట మేకర్స్. 2023 కొత్త సంవత్సరం కానుకగా.. అంటే జనవరి 1న సరికొత్త పోస్టర్‌తో రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. బహుశా మహా శివరాత్రి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. ఇక ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్లో.. అఖిల్ కెరీర్లోనే భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో మలయాళ సీనియర్ హీరో మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తుండగా.. సాక్షి వైద్య హీరోయిన్గా నటిస్తోంది. ఇకపోతే.. ఈ సినిమా కోసం అఖిల్ ఎంతగానో హార్డ్ వర్క్ చేస్తున్నాడు.. సిక్స్ ప్యాక్ కోసం సరికొత్తగా మేకోవర్ అయ్యాడు. ఇప్పటికే రిలీజ్ అయిన అఖిల్ ‘ఏజెంట్’ లుక్ అండ్ టీజర్‌కు భారీ రెస్పాన్స్ వచ్చింది. మరి ఏజెంట్ అఖిల్‌కు ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.